Begin typing your search above and press return to search.

మాన‌వుల‌ ఆయుష్షు ఇంకో 19 ఏళ్లేనట‌!

By:  Tupaki Desk   |   21 Nov 2017 9:53 AM GMT
మాన‌వుల‌ ఆయుష్షు ఇంకో 19 ఏళ్లేనట‌!
X

‘యుగాంతం’ ఈ మాట విన్న ప్ర‌తిసారీ వెన్నులో చ‌లి పుట్ట‌డం స‌హ‌జ‌మే. గ‌తంలో ఎన్నోసార్లు యుగాంతానికి సంబంధించి ఎన్నో వ‌దంతులు వ్యాపించాయి. ఆ త‌ర్వాత వాటిలో ఎలాంటి వాస్త‌వం లేద‌ని రుజువైంది కూడా. అయితే ఈసారి యుగాంతం ప‌క్కా అంటున్నారు. ఈ మాట చెబుతున్న‌ది ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత నాసా శాస్త్ర‌వేత్త‌లు. దీంతో ఇక మాన‌వ మ‌నుగ‌డకు నూక‌లు చెల్లిన‌ట్లేనా? అనే ప్ర‌శ్న త‌లెత్తుతోంది. ఇక ఈ భూమిపై ప్రాణ కోటి బ‌తికేది 19 ఏళ్లేన‌ట‌! అంటే మ‌న పురాణాల్లో చెప్పిన‌ట్టు వచ్చే 19 ఏళ్లలోనే కలియుగం అంతమై పోతుందా? మానవ సమాజం మనుగడ మరో 19 ఏండ్లు మాత్రమేనా? అంటే అవుననే అంటున్నారు నాసా శాస్త్రవేత్తలు.

2036 ఏప్రిల్ 13వ తేదీన అపోఫిన్ అనే గ్రహ శకలం భూగోళాన్ని ఢీ కొడుతుందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ గ్రహ శకలం దెబ్బ‌కు భూమిపై ప్రాణ‌కోటి పూర్తిగా అంతరించిపోతుందట‌. ఫ‌లితంగా అవ‌నిపై మానవ జాతి క‌నుమ‌రుగ‌వుతుంద‌ని నాసా శాస్త్రవేత్తలు అంటున్నారు. నాసా శాస్త్రవేత్తలు స్టీవ్ చెస్లీ - పాల్ ఖోడాస్ అనే శాస్త్ర‌వేత్త‌లు 2004లో మొట్ట‌మొద‌ట‌సారిగా అపోఫిన్ గ్రహ శకలం ఉనికిని కనుగొన్నారు. అప్ప‌టి నుంచి 13 సంవ‌త్స‌రాలుగా దానిని గ‌మ‌నిస్తూనే ఉన్నారు. అసోఫిన్ ప‌ర్వ‌తాకారంలో ఉంటుంద‌ని భావిస్తున్నారు.

హవాయి యూనివ‌ర్సిటీ ఖగోళ శాస్త్ర సంస్థకు చెందిన శాస్త్ర‌వేత్త డావె థోలెన్‌ తో కలిసి దీని కదలికలను పరిశీలించిన స్టీవ్ చెస్లీ, పాల్ ఖోడాస్.. 2036 ఏప్రిల్ 13వ తేదీన భూమిని ఢీ కొట్టే అవ‌కాశ‌మున్న‌ట్టు నిర్థారించిన‌ట్లు వాషింగ్టన్‌లోని నాసా ప్రధాన కార్యాలయం అధికారి డువాన్ బ్రౌన్ చెప్పారు. మరోవైపు అపోఫిస్ 2029 - 2068ల్లోనూ భూమికి అత్యంత సమీపానికి వస్తుందని రష్యన్ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. 2029లో భూమికి 32 వేల కిలోమీటర్ల ఎత్తున పరిభ్రమిస్తుందని వారు పేర్కొన్నారు. ఈ సమయంలో చిన్న పొరపాటు జరిగినా భారీ విధ్వంసానికి దారి తీస్తుందని హెచ్చరించారు. ఇందుకు 2.7 శాతం అవకాశాలు ఉన్నాయని స్ప‌ష్టంచేశారు.

మ‌రోవైపు.. ప్రస్తుతం అంతర్జాతీయంగా భూకంపాలు, సునామీలు తదితర ప్రకృతి విపత్తులు ఎదురవుతున్న నేపథ్యంలో డేవిడ్ మేడ్ వంటి కుట్ర సిద్ధాంత కర్తలు నిబిరు అనే ఉపగ్రహం భూమి వైపు వేగంగా దూసుకొస్తోంద‌ని వెల్ల‌డించారు. అది నవంబర్ 19న భూమిని ఢీకొడుతుందని ప్రచారం చేశారు. ఇప్పుడు అది అంతా అబద్ధమని తేలిపోయింది. నిబిరు అనే గ్రహమేదీ లేదని నాసా మొదటినుంచీ చెబుతున్నా, కుట్ర సిద్ధాంతకర్తలు మాత్రం ప్లానెట్ ఎక్స్ ఉనికిలోనే ఉందని వాదిస్తూ వచ్చారు. అయితే ఇప్ప‌డు సాక్షాత్తూ నాసా శాస్త్ర‌వేత్త‌లే ప‌క్కాగా లెక్క‌లేసి చెబుతుండ‌టంతో ఇక యుగాంతం త‌ప్ప‌ద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.