Begin typing your search above and press return to search.

భూమిపై గ్రహ శకలాల వర్షం... ఏటా 5వేల టన్నుల దూళికణాలు!

By:  Tupaki Desk   |   14 April 2021 2:30 AM GMT
భూమిపై గ్రహ శకలాల  వర్షం... ఏటా 5వేల టన్నుల దూళికణాలు!
X
ఏటా భూమిపై గ్రహాంతర కణాలు పడుతూనే ఉంటున్నాయి. చిన్న చిన్న దూళి గణాల రూపంలో ఇవి భూమిపై చేరుతున్నాయి. సౌర వ్యవస్థ చాలా దుమ్ముతో నిండి ఉంటుంది. ఆ కక్ష్యలో భూమి ప్రయామించినప్పుడు అవి భూమిపై పడతాయి. ఉల్కపాతం రూపంలో భూగోళంపై చేరుతున్నాయి. అయివే వీటి పరిమాణం ఎంత ఉంటుందో తెలుసుకోవడానికి శాస్త్రవ్తేతలు పరిశోధనలు మొదలెట్టారు.

భూమిపై జారిపడుతున్న గ్రహాంతర శకలాలను లెక్కించుందుకు అంతరిక్ష శాస్త్రవేత్తలు 20 ఏళ్ల నుంచి అధ్యయనం చేస్తున్నారు. ఏటా దాదాపు 5 వేల టన్నుల దూళి కణాలు భూమిపై చేరుతున్నాయని పరిశోధకులు అంచనా వేశారు. భూమిపై రెండున్నర అంతరిక్ష నౌక పరిమాణంలో దుమ్ము కణాలు వర్షంలా భూగోళంపై చేరుతున్నాయని వెల్లడించారు.

పదివేల కిలోమీటర్ల నుంచి అతిపెద్ద గ్రహశకలాలు భూమిపై పడుతున్నాయని వారి అధ్యయనాల్లో వెల్లడించారు. వీటిలో చిన్న పరిమాణంలో ఉండే దూళి కణాలను గుర్తించారు. ఈ శకలాలు 80 శాతం తోక చుక్కల నుంచే ఏర్పడతాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మిగిలిన 20 శాతం దూళి కణాలుగా గుర్తించారు. బృహస్పతి నుంచి ఎక్కువగా పడుతుంటాయని తెలిపారు.

అంటార్కిటికా ఖండంలోనే ఈ గ్రహశకలాలు ఎక్కువగా పడుతాయని చెబుతున్నారు. అక్కడి వాతావరణంలో వీటిని సులభంగా గుర్తించవచ్చని తెలిపారు. ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం వల్ల మంచు ఏర్పడి ఈ దుమ్ము కణాలు కొట్టుకుపోతాయని అంచనా గుర్తించారు.