Begin typing your search above and press return to search.

కేసీఆర్ ప్లాన్ లకు చెక్.. ఝలకిచ్చిన అశ్వత్థామ రెడ్డి

By:  Tupaki Desk   |   16 Nov 2019 7:58 AM GMT
కేసీఆర్ ప్లాన్ లకు చెక్.. ఝలకిచ్చిన అశ్వత్థామ రెడ్డి
X
కేసీఆర్ సర్కారు కఠినంగా ఉంది. ఎక్కడ బహిరంగంగా దీక్ష చేసినా అరెస్ట్ చేసి దీక్షను భగ్నం చేస్తుంది. ఆర్టీసీ సమ్మె పై అగ్గి మీద గుగ్గిలం లా ఉన్న కేసీఆర్ అంత ఈజీగా వదిలి పెట్టే రకం కాదు. అందుకే ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. ఏకంగా ఇంటినే దీక్ష వేదికగా మార్చేశారు. పోలీసులు, కేసీఆర్ కు ఊహించని షాకిచ్చారు.

తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె ఎంతకూ తెగడం లేదు. ఇటు ఆర్టీసీ కార్మికులు, అటు కేసీఆర్ మొండిపట్టుదలకు పోయారు. సమ్మెతో హక్కులు సాధిస్తామని తొడ కొట్టిన ఆర్టీసీ కార్మిక సంఘాల కు కేసీఆర్ తీరుతో రోజురోజుకు ఆశ చచ్చిపోతోంది. దీంతో తాజాగా నిరవధిక నిరాహార దీక్షకు దిగాలని డిసైడ్ అయ్యారు. అయితే ఎక్కడ చేసినా కేసీఆర్ సర్కారు భగ్నం చేస్తుంది. అందుకే తాజాగా ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఎల్ బీ నగర్ లోని తన ఇంటిలోనే దీక్ష కు దిగి పోలీసులు, కేసీఆర్ సర్కారు షాకిచ్చారు.

అర్ధ రాత్రియే అశ్వత్థామ రెడ్డి ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయన దీక్ష చేయకుండా అడ్డుకున్నారు. దీంతో ఆర్టీసీ కార్మికుల కు పోలీసుల కు గొడవ జరిగింది. అశ్వత్థామ రెడ్డి ని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో తన ఇంటిలోనే దీక్షకు దిగారు అశ్వత్థామ రెడ్డి. ప్రాణం ఉన్నంత వరకూ దీక్ష చేస్తానంటున్నారు.

ఇక జేఏసీ నేతల నిరాహార దీక్షను భగ్నం చేయడానికి పోలీసులు ఇప్పటికే అందరినీ అరెస్ట్ చేశారు. ఆర్టీసీ జేఏసీ నేతలు, కార్యాలయాల ను తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. దీంతో జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తన ఇంటినుంచే పోరు బాటకు శ్రీకారం చుట్టడం విశేషం.