Begin typing your search above and press return to search.

రాత్రి 8:30 గంటలకే పాక్ లో మార్కెట్లు బంద్.. విషయమెంటీ?

By:  Tupaki Desk   |   4 Jan 2023 5:10 AM GMT
రాత్రి 8:30 గంటలకే పాక్ లో మార్కెట్లు బంద్.. విషయమెంటీ?
X
ఉగ్రవాదానికి కేరాఫ్ గా మారిన పాకిస్తాన్ ఇప్పుడు ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతోంది. రాజకీయ అస్థిరత.. ఉగ్రవాదం.. కరోనా ఎఫెక్ట్.. ఆర్థిక మాంద్యం వంటి సమస్యలు ఆ దేశాన్ని గుక్కతిప్పుకోకుండా చేస్తున్నాయి. ఒకదాని తర్వాత ఒక్కటి వచ్చి పడుతుండటంతో పాకిస్థానీయుల జీవన పరిస్థితి దయనీయంగా మారుతోంది.

పాక్ లో రాజకీయ అస్థిరత కారణంగా గత కొన్నేళ్లు పాలన గాడి తప్పింది. అభివృద్ది ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. పేద ప్రజలకు కొన్ని సంక్షేమ పథకాలు మాత్రం అందుతున్నాయి. అందించిన కాడల్లా అప్పులు చేసిన పాకిస్థాన్ ను కరోనా పరిస్థితులు దెబ్బతీశాయి. ఇప్పుడు ఎక్కడా అప్పు పుట్టే పరిస్థితి లేదు.

ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ సైతం ఇటీవల దివాళా తీసిన శ్రీలంక బాటలో పయనిస్తోంది. పాకిస్థాన్ దగ్గర కేవలం ఒక నెలకు సరిపడా విదేశీ నిల్వలు మాత్రమే ఉన్నారు. ఈ నెల రోజుల్లో పాకిస్థాన్ ప్రభుత్వం అక్కడి పరిస్థితిని గాడిలో పెట్టకపోతే పరిస్థితులు మరింత దిగజారడం ఖాయమని పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ ఇటీవల నివేదించింది.

దీంతో పాకిస్థాన్ దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. మరోవైపు పేదలకు ఇచ్చే ఇచ్చే సబ్సిడీల్లో కోత విధిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసరాల ధరలు.. వంట గ్యాస్.. పెట్రోల్.. డీజీల్ ధరలు ఆకాశాన్నంటాయి. వీటిని అదుపు చేసేందుకు సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది.

ఈ మేరకు దేశంలో ఇంధనం పొదుపు చర్యలను పాకిస్తాన్ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పాక్ లోని మార్కెట్లన్నీ రాత్రి 8:30 గంటలకే మూసివేసేలా నిర్ణయం తీసుకుంటున్నారు. రాత్రి 10 గంటలకు ఫంక్షన్ హాళ్లు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని పాక్ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ అధికారులను ఆదేశించారు.

ఫిబ్రవరి నుంచి బల్పుల తయారీని.. జూలై నుంచి నాసిరకం ఫ్యాన్ల ఉత్పత్తిని ఆపివేస్తామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ ఆఫీసుల్లో 30శాతం విద్యుత్ ఆదాకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇంధన పొదుపు చర్యలు వెంటనే అమల్లోకి వస్తాయని ఖ్వాజా ఆసిఫ్ వెల్లడించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.