Begin typing your search above and press return to search.
ఫ్రాన్స్ ట్రక్కు విధ్వంసంలో 80 మంది బలి
By: Tupaki Desk | 15 July 2016 5:37 AM GMTఫ్రాన్స్ లో ఘోరం చోటుచేసుకుంది. ఆ దేశ జాతీయ దినోత్సవం బాస్టిల్ డే కార్యక్రమం పెను విషాదాన్ని మిగిల్చింది. బాస్టిల్ డే ను పురస్కరించుకొని ఫ్రెంచ్ రివేరియా రిసార్ట్ లోని నైస్ సిటీలో నిర్వహించిన వేడుకలో భారీ విధ్వంసమే చోటు చేసుకుంది. ఈ ఉత్సవాల్లో భాగంగా భారీ ఎత్తున బాణసంచాను కాలుస్తారు. ఇలా కాల్చినప్పుడు వచ్చే వెలుగుల్ని చూసేందుకు..ఈ కార్యక్రమాన్ని నేరుగా తిలకించేందుకు వీలుగా పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు.
ఫైర్ క్రాకర్స్ ను పేలుస్తున్న సమయంలో సంబరాలు అంబరాన్ని అంటుతున్న వేళ.. ఆ ఉత్సావాన్ని ఉత్సాహాంగా చూస్తున్న వారిపై ఒక ట్రక్కు వేగంగా ఢీ కొనటం.. ఈ ఘటనలో ఏకంగా 80 మంది మృతి చెందటం షాకింగ్ గా మారింది. అదే సమయంలో పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటనలో గాయాల పాలైన వారి సంఖ్య వందకు మించి ఉంటుందని అక్కడి మీడియా చెబుతోంది. ఒక ట్రక్కు అదుపు తప్పిన వైనానికి ఇంత భారీనష్టం వాటిల్లటంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక కుట్ర కోణం ఏమైనా ఉందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఉత్సవాల్లో విధ్వంసం సృష్టించేందుకే ట్రక్కు దాడికి పాల్పడ్డారా? అన్నది ఇప్పుడు సందేహంగా మారింది. దీని వెనుక ఏదైనా ఉగ్రదాడి ఉందా? లేక.. ప్రమాదవశాత్తు ఈ ఘటన చోటు చేసుకుందా? అన్న ప్రశ్నలకు సమాధానం రావటం లేదు. ప్రాధమికంగా చూసినప్పుడు కుట్రపూరిత దాడిగా పలువురు అంచనా వేస్తున్నారు. ఘటనా స్థలానికి సహాయక బృందాలు చేరుకొని సాయం అందిస్తున్నాయి.