Begin typing your search above and press return to search.
ఒక్కసారిగా భూమా మౌనిక సైలెంట్.. అసలు విషయం అదేనా?
By: Tupaki Desk | 18 Jan 2021 4:30 PM GMTవందల కోట్ల విలువైన హఫీజ్ పేట భూ వివాదం నేపథ్యంలో జరిగిన బోయినపల్లి సోదరుల కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియను ఏ వన్ నిందితురాలిగా పోలీసులు అరెస్టు చేసి ఆమెను జైలుకు తరలించిన విషయం తెలిసిందే. మూడురోజులుగా పోలీసులు అఖిల ప్రియ ను ఈ కేసు విషయమై విచారిస్తున్నారు. మొన్నటి వరకు రాజకీయాల్లో తెర వెనకే ఉన్న భూమా మౌనిక తన అక్క అరెస్టుతో ఒక్కసారిగా క్రియాశీలకంగా మారింది. తన సోదరిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కుట్ర చేసి తమ కుటుంబీకులను కేసుల్లో ఇరికిస్తున్నారని ఆరోపణలు చేశారు. 'ఆడపిల్ల అని కూడా చూడకుండా తన అక్కను దారుణంగా అరెస్టు చేశారు. ఆమెను ఒక టెర్రరిస్టు అరెస్టును చేసినట్లుగా చేశారు. తల్లిదండ్రులు లేని పిల్లలమని తెలిసి తమను వేధిస్తున్నారంటూ' భూమా మౌనిక ఆరోపణలు చేశారు. అఖిలప్రియను అరెస్టు చేసినప్పటి నుంచి భూమా మౌనిక ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు.
వరుసబెట్టి మీడియా సమావేశాల్లో మాట్లాడుతూ వస్తున్న భూమా మౌనిక నాలుగు రోజులుగా సైలెంట్ గా మారారు. ఎక్కడా ఆమె ఊసే కనిపించడం లేదు. తల్లిదండ్రులు లేని పిల్లలను ప్రభుత్వాలు వేధిస్తున్నాయని సెంటిమెంట్ పడే విధంగా మాట్లాడిన మౌనిక పోలీసులు కిడ్నాప్ కు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతే అఖిలప్రియ ను అరెస్ట్ చేసినట్లు తెలియడం, తన తల్లిదండ్రులను గుర్తుచేసి సెంటిమెంట్ గా మాట్లాడినా ఎవరూ నమ్మకపోవడంతో భూమా మౌనిక ఒక్కసారిగా సైలెంట్ గా మారారు. మూడు, నాలుగు రోజులుగా ఆమె ఎక్కడా కనిపించలేదు.
మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తోందని తెలిసింది.
మొన్నటి వరకు తన అక్కకు అంత సపోర్టుగా మాట్లాడిన మౌనిక ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా మారారో అర్థం కావడం లేదు. అయితే భూమా అఖిలప్రియను ఎవరూ ప్లాన్ చేసి కేసులో ఇరికించలేదని సమాచారం. వందల కోట్ల విలువ చేసే విలువైన భూమి వివాదంలో తన భర్త భార్గవ్ రామ్, అత్త కిరణ్యి, మామ మురళి, మరిది చంద్రహాస్లతో కలసి అఖిలప్రియ కిడ్నాప్ కు ప్లాన్ చేసిన విషయం బయటపడింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు మొబైల్ ఫోన్ ఆధారంగా, కాల్ డేటా ఆధారంగా ఆధారాలు సేకరించిన తర్వాతే అఖిలప్రియ ను అరెస్టు చేశారని సమాచారం. అయితే ఆడపిల్లలను వేధిస్తున్నారంటూ భూమా మౌనిక సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేసి, తర్వాత తన అక్క అరెస్టుకు సంబంధించి పోలీసుల వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని తెలియడంతో ఒక్కసారిగా సైలెంట్ గా మారారని చెబుతున్నారు.