Begin typing your search above and press return to search.

కౌంటింగ్‌ వేళ.. శశి థరూర్‌ కలకలం!

By:  Tupaki Desk   |   19 Oct 2022 8:50 AM GMT
కౌంటింగ్‌ వేళ.. శశి థరూర్‌ కలకలం!
X
అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి సుదీర్ఘకాలం తర్వాత ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రులు మల్లిఖార్జున ఖర్గే, శశి థరూర్‌లు పోటీ చేశారు. కాగా సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ మద్దతుతోపాటు దేశంలో మెజారిటీ పీసీసీల మద్దతు ఖర్గేకే ఉందని వార్తలు వచ్చాయి. ఆయనే అధ్యక్ష పదవిని చేపట్టడం ఖాయమైంది.

కాగా ప్రస్తుతం కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపు ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో సాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన తిరువనంతపురం ఎంపీ శశి థరూర్‌ సంచలనం రేపారు.

ఇప్పటివరకూ కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అధిష్టానం పక్షపాతం లేకుండా ఇద్దరు అభ్యర్ధుల్ని సమానంగానే చూసిందని శశి థరూర్‌ చెప్పుకుంటూ వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఎన్నికలు కూడా సజావుగానే జరిగాయని తెలిపారు. అలాంటిది ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆరోపణలు ఎక్కుపెట్టారు. ఇది కాంగ్రెస్‌ వర్గాల్లో కలకలం రేపడంతోపాటు తీవ్ర చర్చనీయాంశమైంది.

ఈ మేరకు కాంగ్రెస్‌ అధ్యక్ష అభ్యర్థి శశి థరూర్‌ ఎన్నికల ఏజెంట్‌ సల్మాన్‌ సోజ్‌ అక్టోబర్‌ 19న కాంగ్రెస్‌ సెంట్రల్‌ ఎలక్షన్‌ అథారిటీ చైర్మన్‌ మధుసూధన్‌ మిస్త్రీకి లేఖ రాయడం విశేషం. ఇందులో పలు ఆరోపణలు చేస్తూ లేఖ సంధించారు. ఉత్తరప్రదేశ్‌లో అధ్యక్ష ఎన్నికల నిర్వహణకు సంబంధించి చాలా తీవ్రమైన అవకతవకలు జరిగాయని లేఖలో విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో యూపీలో పోలైన ఓట్లను చెల్లనవిగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

వాస్తవానికి అక్టోబర్‌ 19న కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ కౌంటింగ్‌ ప్రారంభమైన వెంటనే శశి థరూర్‌ టీమ్‌ ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు చేయడం గమనార్హం. ఈ వ్యవహారానికి సంబంధించి తాము నిరంతరం ఎన్నికల అథారిటీ ఛైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీ ఆఫీసుతో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు శశి థరూర్‌ బృందం చెబుతోంది. ఎన్నికలకు సంబంధించి పలు అంశాలపై తాము ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు గుర్తు చేసింది.

ఈ నేపథ్యంలో తాజాగా మిస్త్రీకి రాసిన లేఖలో థరూర్‌ ఎన్నికల బృందం.. యూపీలో ఎన్నికల నిర్వహణలో చాలా తీవ్రమైన అవకతవకలు జరిగాయనే విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నట్టు తెలిపింది. యూపీలో జరిగిన ఎన్నికల పోలింగ్‌లో అక్రమాలు జరిగాయని, సరైన పద్ధతుల్లో జరగలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో యూపీలో పోలైన ఓట్లను పక్కనపెట్టాలని శశి బృందం డిమాండ్‌ చేసింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.