Begin typing your search above and press return to search.

గుజరాత్ ఎన్నికల వేళ.. సరికొత్త నినాదం రెఢీ.. మోడీనే ప్రచారకర్త

By:  Tupaki Desk   |   7 Nov 2022 4:31 AM GMT
గుజరాత్ ఎన్నికల వేళ.. సరికొత్త నినాదం రెఢీ.. మోడీనే ప్రచారకర్త
X
తాను ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో తమ పార్టీ తప్పించి మరో పార్టీకి అవకాశం ఇవ్వకూడదన్న పట్టుదల ప్రధాని నరేంద్ర మోడీలో కనిపిస్తూ ఉంటుంది. ఈ రోజున మోడీ ఈ స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం గుజరాతే.

అలాంటి రాష్ట్రానికి తాజాగా అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో.. ఈసారి తామే అధికారపక్షంగా అవతరించాలనన పట్టుదలలో అధికార బీజేపీ ఉంది. ఇప్పటికే వెలువడిన సర్వే ప్రకారం చూస్తే.. గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ సీట్లను బీజేపీ సొంతం చేసుకునే వీలుందన్న మాట వినిపిస్తోంది.

గుజరాత్ ఎన్నికల్లో భాగంగా సరికొత్త నినాదాన్ని తెర మీదకు తీసుకొచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. తాజాగా తాను పాల్గొన్న కార్యక్రమంలో మాట్లాడిన సందర్భంగా.. గుజరాత్ కు కొత్త నినాదాన్ని ఆయన వినిపంచారు.

రానున్న రోజుల్లో దీన్ని ప్రధాన అస్త్రంగా వాడే వీలుందన్న మాట వినిపిస్తోంది. "గుజరాత్ ను నేనే తయారు చేశాను" అన్న భావన గుజరాత్ ప్రజల్లో ప్రతి ఒక్కరికి రావాలన్న ఆయన.. "ఈ భావన ప్రతి ఒక్కరిలోనూ రావాలి" అని స్పష్టం చేశారు.

ప్రతి గుజరాతీ పౌరుడు గుండెల నిండా ఆత్మవిశ్వాసంతో ఉంటాడని.. అందుకే వాళ్లు మాట్లాడిన ప్రతిసారీ గుండె లోతుల్లో నుంచి వస్తుంది. అందుకే నేనే ఈ గుజరాత్ ను తయారు చేశాను. ప్రతి ఒక్కరిలోనూ ఈ మాట నాటుకుపోవాలి" అంటూ స్పష్టం చేశారు. గడిచిన 20 ఏళ్లుగా రాష్ట్ర పరువును తీసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తూనే ఉందని మండిపడ్డారు.

రాష్ట్ర పరువును తీయాలని ప్రయవ్నిస్తున్న విచ్చిన్న శక్తులకు గుజరాత్ ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ప్రధాని మోడీ. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. గుజరాత్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావటానికి ముందే బీజేపీ అగ్ర నాయకత్వం గుజరాత్ లో తమ ప్రచారాన్ని షురూ చేయటం గమనార్హం. డిసెంబరు ఒకటి.. ఐదో తేదీల్లో పోలింగ్ జరగ్గా.. ఎనిమిదిన ఓట్ల లెక్కింపు జరగనుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.