Begin typing your search above and press return to search.
'అటల్'.. మీకు 'జోహార్లు'.. నేడు వాజ్ పేయి 98వ జయంతి..!
By: Tupaki Desk | 25 Dec 2022 6:19 AM GMTఅటల్ బిహారీ వాజ్ పేయ్ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి 1998 పోఖ్రాన్ అణు పరీక్ష.. 1999 కార్గిల్ యుద్ధం.. 1999లో ఢిల్లీ-లాహోర్ మధ్య బస్సు సర్వీస్ ప్రారంభం లాంటి ఘటనలు గుర్తుకొస్తాయి. అంతేకాకుండా ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో తొలిసారి హిందీలో ప్రసంగించిన నేతగానూ అటల్ బిహారీ వాజ్ పేయి కీర్తిని గడించారు.
నేడు ఆయన 98వ జయంతి సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..! అటల్ బిహారి వాజ్ పేయ్ తన రాజకీయ జీవితంలో ఎన్నో కీలక పదవులు చేపట్టారు. 1957లో తొలిసారి ఉత్తరప్రదేశ్ లోని బలరాంపూర్ నుంచి జన్ సంఘ్ టికెట్ పై గెలిచి తొలిసారి లోక్ సభలో అడుగు పెట్టారు.
అనంతరం గ్వాలియర్.. న్యూఢిల్లీ.. లక్నో తదితర ప్రాంతాల నుంచి లోక్ సభకు పదిసార్లు ఎన్నికయ్యారు. ఎమర్జెన్సీ తర్వాత 1977లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో జనాతా పార్టీ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలోనే మొరార్జీ భాయ్ దేశాయ్ నేతృత్వంలో ప్రభుత్వంలో అటల్ బిహారి వాజ్ పేయి విదేశాంగ మంత్రిగా పని చేశారు.
భారతీయ జనతా పార్టీ(బీజేపీ)ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు వాజ్ పేయి ఎంతో కృషి చేశారు. 1990లో దశకంలో బీజేపీలో వాజ్ పేయ్ కీలక నేతగా మారారు. 1996లో తొలిసారిగా కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. ఆ సమయంలో వాజ్ పేయి కేవలం 13 రోజుల పాటే ప్రధానిగా ఉన్నారు. పార్లమెంట్ లో పూర్తిస్థాయి మెజార్టీ లేకపోవడంతో నాటి ప్రభుత్వం కూలిపోయింది.
ఆ తర్వాత 1998లో అటల్ బిహారి మళ్లీ ప్రధాని పదవీ చేపట్టారు. ఆ తర్వాత 1999 నుంచి 2004 వరకు మూడోసారి భారత ప్రధాని వాజ్ పేయి కొనసాగారు. ఆయన హయాంలోనే పోఖ్రాన్ అణు పరీక్ష జరిపి అగ్రరాజ్యం అమెరికాకు భారత్ తక్కువేమి కాదని నిరూపించారు. కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్ ను మట్టి కరిపించేలా చేసి ప్రతీ భారతీయుడు గర్వపడేలా చేశారు.
ఢిల్లీ-లాహోర్ సర్వీస్ ప్రారంభంతో భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలను పునరుద్ధరించారు. కాగా 2001లో పార్లమెంట్ భవనంపై దాడి జరిగిన సమయంలోనూ ఆయనే ప్రధానిగా ఉన్నారు. వాజ్ పేయి ప్రసంగిస్తుంటే ప్రజలంతా ఇలా చూస్తుండి పోయేవారు. అంతలా తన ప్రసంగంతో ఆయన అందరినీ మెస్మరైజ్ చేసేవారు. సందర్భానికి తగిన చమత్కారాలతో ఆయన ప్రసంగం ఆద్యంతం కొనసాగేది.
ఐక్య రాజ్య సమతి జనరల్ అసెంబ్లీలో తొలిసారి హిందీలో మాట్లాడిని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనకు 27 మార్చి 2015న దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డును ప్రధానం చేసింది. ఆయన పుట్టిన రోజును కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా గుడ్ గవర్నెస్ డేగా జరుపుకుంటోంది. ఇక వాజ్ పేయి క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొని 23 రోజులు జైలు జీవితం గడిపారు.