Begin typing your search above and press return to search.
వాజపేయ్ తాజా రికార్డును బీట్ చేయలేరు
By: Tupaki Desk | 7 Sep 2016 10:30 PM GMTమాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయ్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకూ కేంద్రం.. కొన్ని రాష్ట్రాలు అమలు చేసే పథకాలకు నెహ్రు.. ఇందిర.. రాజీవ్ పేర్లు ఉండటం కనిపిస్తుంది. అయితే.. ఇప్పటివరకూ మరే భారతీయ నేత అందుకోని అరుదైన గౌరవాన్ని ఆయన సొంతం చేసుకోనున్నారు. జీవించి ఉండగానే అత్యధిక ప్రభుత్వ పథకాలకు పేరున్న నేతగా వాజపేయ్ రికార్డు సృష్టించారు.
మోడీ సర్కారు అమలు చేస్తున్న అనేక పథకాల్లో అత్యధికంగా వాజపేయ్ పేరు మీద ఉండటం గమనార్హం. దీంతో.. ఇప్పటివరకూ మాజీ ప్రధానులుగా ఉన్న నెహ్రు.. ఇందిర.. రాజీవ్ గాంధీ పేరు మీద ఉన్న పథకాల కంటే వాజపేయ్ మీదున్న అమలవుతున్న పథకాల సంఖ్యే ఎక్కువగా ఉన్నాయి. మోడీ సర్కారుతో పాటు.. వివిధ రాష్ట్రాల్లో అమలు చేసే ప్రభుత్వ పథకాలకు ‘అటల్’ అన్న పేరు చేర్చారు.
కేంద్రంలోని మోడీ సర్కారుతో పాటు.. వివిధ రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు సైతం వాజపేయ్ మీద తమకున్న అభిమానాన్ని ప్రదర్శించే పని చేపట్టారు. ఒక్క రాజస్థాన్ ప్రభుత్వం తమ రాష్ట్రంలోని 9వేల గ్రామపంచాయితీ కేంద్రాలకు అటల్ సేవా.. సువిధ కేంద్రాలుగా పేరు పెట్టింది. ఇక.. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సైతం వాజపేయ్ పేరు మీద అనేక కార్యక్రమాన్ని షురూ చేసింది. ఇలా కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు అటల్ పేరును వినియోగించటం ద్వారా.. జీవించి ఉన్నప్రధానుల పేర్లతో అమలవుతున్న ప్రభుత్వ కార్యక్రమాల్లో వాజపేయ్ ముందున్నారు. సమీప భవిష్యత్ లో వాజపేయ్ రికార్డును బ్రేక్ చేసే మొనగాడు లాంటి మరొకరు ఉండరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.