Begin typing your search above and press return to search.

అచ్చెన్నాయుడు ఆ ఫిగర్ ఎలా చెప్పారు?

By:  Tupaki Desk   |   14 May 2016 6:35 AM GMT
అచ్చెన్నాయుడు ఆ ఫిగర్ ఎలా చెప్పారు?
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు షురూ చేసిన ఆపరేషన్ ఆకర్ష్ తో ఎంత జోరుగా సాగుతుందన్న విషయం తెలిసిందే. ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా సాగుతున్న జంపింగ్స్ కారణంగా ఇప్పటివరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏపీ అధికారపార్టీలోకి 17 మంది ఎమ్మెల్యేలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇంతకీ ఈ జంపింగ్స్ పర్వం ఎప్పటి వరకూ సాగుతుంది? ఎంతవరకూ వెళుతుంది? ఎంతమంది అధికార పార్టీ తీర్థం తీసుకుంటారు? జగన్ వెంట ఉండే నేతలు ఎంతమంది? లాంటి ప్రశ్నలు చాలానే వినిపిస్తున్నా సమాధానాలు దొరకని పరిస్థితి.

ఇదిలా ఉంటే.. జగన్ పార్టీలో జగన్ ఒక్కరే మిగులుతారంటూ బడాయి మాటలు చాలానే చెబుతున్నా ఏపీ తెలుగు తమ్ముళ్లు. ఇలాంటి మాటలకు భిన్నమైన మాట ఒకటి ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు నోటి నుంచి వచ్చింది. జగన్ పార్టీ నుంచి మొత్తం 47 మంది ఎమ్మెల్యేలు రావటం ఖాయమని.. ఇప్పటికి 17 మంది ఎమ్మెల్యేలు వచ్చేశారని.. రానున్నరోజుల్లో మరో 30 మంది రావటం ఖాయమని తేల్చారు.

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగిన ఒక సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యల్ని చేసిన అచ్చెన్నాయుడు మాటలు జగన్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎందుకంటే.. ఇప్పటివరకూ జంపింగ్స్ గురించి మాట్లాడిన నేతలంతా హడావుడి అంకెలు.. అసాధ్యమైన అంశాల్నే ప్రస్తావించారే తప్పించి.. లెక్కగా చెప్పింది ఎవరూ లేరు. అందుకు భిన్నంగా అచ్చెన్నాయుడు మాత్రం 47 మంది జగన్ ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తారంటూ విస్పష్టంగా చెప్పటం చూస్తుంటే.. జంపింగ్స్ కు సంబంధించి అచ్చెన్నాయుడి దగ్గర చాలానే ఇన్ఫర్మేషన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. జగన్ పార్టీ నుంచి జంప్ అయ్యేందుకు వీలుగా మంతనాలు సాగిస్తున్న ముఖ్యనేతల్లో అచ్చెన్నాయుడు కూడా ఉన్నారా ఏంటి..?