Begin typing your search above and press return to search.
బాబును దెబ్బకొట్టేందుకే రాష్ట్ర విభజనట!
By: Tupaki Desk | 2 Jun 2018 6:39 AM GMTచెప్పేవాడు చంద్రబాబైతే వినేవాడు వెర్రి వెంగళప్ప....అని ఓ మోడర్న్ సామెత వాడుకలో ఉంది. చంద్రబాబు నేతృత్వంలో పనిచేస్తోన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు - మంత్రులకు కూడా ఆ సామెత వర్తిస్తుంది. అబ్దుల్ కలాంను రాష్ట్రపతి అభ్యర్థిగా సిఫారసు చేసింది నేనే అన్న చంద్రబాబు కామెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే......బ్రిటిషు వారితో పోరాడిన జాతి తెలుగు దేశం పార్టీ అనే కామెంట్ వరకు చంద్రబాబు నోటినుంచి అనేక ఆణిముత్యాలు జాలువారాయి. ఈ విషయాలపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కూడా జరుగుతోంది. మరోపక్క.... చంద్రబాబుకు తామేమీ తీసిపోమన్నట్లు టీడీపీ మంత్రులు వ్యవహరిస్తున్నారు. తాజాగా రాష్ట్ర విభజనపై, చంద్రబాబుపై మంత్రి అచ్చెన్నాయుడు ఇవే తరహా వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. కేవలం చంద్రబాబును దెబ్బతీసేందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చేశారని అచ్చెన్నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. విజయవాడలో జరుగుతోన్న నవ నిర్మాణ దీక్షలో పాల్గొన్న అచ్చెన్నాయుడు ఈ కామెంట్స్ చేశారు.
రాబోయే ఎన్నికల్లో తృతీయ కూటమి అధికారంలోకి రాబోతోందని, అత్యంత అనుభవశీలి అయిన చంద్రబాబు ప్రధాని అభ్యర్థి అని తెలుగు తమ్ముళ్లు బాకా ఊదుతోన్న సంగతి తెలిసిందే. ప్రధాని రేసులో మోదీకి చంద్రబాబే ప్రధాన అడ్డంకి అని అందుకే బాబును అణగదొక్కేందుకు ఆయనపై ఓటుకునోటు వంటి కేసులు తిరగదోడుతున్నారని ఓ ప్రచారం జరుగుతోంది. తాజాగా అదే తరహాలో మరో కొత్త వాదనను మంత్రి అచ్చెన్నాయుడు తీసుకురావడం విశేషం. చంద్రబాబును దెబ్బతీసేందుకే కష్టపడి రాష్ట్ర విభజన చేశారని ఆయన అన్నారు. తమపై విమర్శలు చేసే వారంతా హోదా కోసం తమతో కలిసిరావాలని అన్నారు. విభజన విషయంలో చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. నిజంగా బాబుకు విభజన ఇష్టం లేకుంటే ద్వంద్వ నీతిని అవలంబించేవారు కాదని విమర్శలు వచ్చాయి. ఏపీలో చంద్రబాబును దెబ్బకొట్టేందుకు విభజన చేయడం అనేది మంత్రిగారి ఊహాశక్తికి పరాకాష్ట అని అనిపించకమానదు.