Begin typing your search above and press return to search.
నాని ఎర్రగడ్డలో.. అచ్చెన్న వెటర్నరీ ఆస్పత్రిలో..
By: Tupaki Desk | 13 Dec 2019 11:16 AM GMTఏపీ అసెంబ్లీలో తిట్లవర్షం కురిసింది. దిశ బిల్లుపై చర్చ సందర్భంగా అధికార వైసీపీ - ప్రతిపక్ష టీడీపీ సభ్యులు తిట్టిపోసుకున్నారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు - మంత్రి కొడాలి నానిల మధ్య మాటల యుద్ధం నడిచింది.
వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మహిళలను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన అచ్చెన్న ఆరోపణలు చేసిన మంత్రి కొడాలి నానిని ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్పించాలని సెటైర్ వేశారు. వ్యక్తులను గౌరవించాలని హితవు పలికారు. తనపై కేసులు ఉంటే విచారణ చేయాలని అచ్చెన్నాయుడు కోరారు. ఎస్టీ కాకున్నా మీలో సర్టిఫికెట్ తీసుకొని డిప్యూటీ సీఎం పదవి కొట్టేశారని ధ్వజమెత్తారు.
అచ్చెన్నాయుడు విమర్శలపై మంత్రి కొడాలి నాని శివాలెత్తిపోయాడు. తనను ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్చడం కాదని.. అచ్చెన్నాయుడును వెటర్నరీ ఆస్పత్రిలో చేర్పించాలని విమర్శించారు. ఇటీవల రాష్ట్రానికి ఒక మానసిక వైద్యం కేంద్రం వచ్చిందని.. ఆ ఆస్పత్రికి చంద్రబాబు మానసిక వైద్యం కేంద్రం పేరు పెట్టాలని సూచించారు. ఈ ఆస్పత్రిలో మార్షల్స్ ను కొట్టిన లోకేష్ ను కూడా చేర్చించాలని సూచించారు. అధికార ప్రతిపక్షాల విమర్శలు ప్రతి విమర్శల తర్వాత బిల్లుకు ఆమోదం లభించింది.