Begin typing your search above and press return to search.
అచ్చెన్నాయుడికి కరోనా నెగెటివ్.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
By: Tupaki Desk | 31 Aug 2020 12:00 PM GMTఏపీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు కరోనా నెగెటివ్ గా నిర్ధారణ అయ్యింది. సోమవారం ఉదయం నిర్వహించిన కరోనా పరీక్షలో ఆయనకు నెగెటివ్ అని తేలింది. దీంతో ఈ సాయంత్రం ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
ఈఎస్ఐ మందుల కుంభకోణం కేసులో అచ్చెన్నాయుడు ఆరోపణలు ఎదుర్కొంటూ ఏసీబీ అధికారుల చేత అరెస్ట్ అయ్యారు. జూన్ 12న అచ్చెన్నాయుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇక ఆగస్టు 13న అచ్చెన్నాయుడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. జ్యూడీషియల్ రిమాండ్ లో ఉన్న అచ్చెన్నాకు విజయవాడ రమేశ్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈఎస్ఐ కేసులో ఇప్పటికే అచ్చెన్నాయుడికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. డిశ్చార్జ్ అయిన అనంతరం అచ్చెన్నాయుడు నేరుగా శ్రీకాకుళం జిల్లాలోని తన స్వగ్రామం నిమ్మాడకు బయల్దేరి వెళ్లారు.