Begin typing your search above and press return to search.
అచ్చెన్నకు బాలయ్య ఆవహించాడా?
By: Tupaki Desk | 25 Oct 2017 1:24 PM GMTచంద్రబాబు కేబినెట్ లో మంత్రి అచ్చెన్నాయుడు అంటే.. సాధారణంగా మీడియాకు హడల్. ఎందుకంటే.. ఆయన ప్రెస్ మీట్ పెట్టారంటే.. ఖంగుమని హైపిచ్ లో మోగే ఆయన కంఠస్వరం మైకు అవసరం లేకుండానే.. విలేకరుల చెవుల తుప్పు వదలగొట్టేలా ఉంటుంది. అలాంటిది... ఆ ప్రెస్ మీట్ కాస్తా రాజకీయ ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోయడానికి పూనుకున్నాడంటే మాత్రం.. ఇక దబిడి దిబిడే. దబిడి దిబిడే అంటే గుర్తొచ్చింది. తాజాగా అచ్చెన్నాయుడు కు నందమూరి బాలకృష్ణ ఆవహించినట్లున్నారు. బాలయ్య ఫాక్షన్ సినిమాల్లో బెదిరించిన రేంజిలో.. ఆయన వైసీపీకి హెచ్చరికలు ఇచ్చేస్తున్నారు మరి!
‘నీ ఊరికొస్తా.. నీ ఇంటికొస్తా.. నీ నట్టింటికొస్తా...’ అంటూ బాలయ్య చెప్పిన డైలాగులు తెలుగునాట ఎంత ఫేమసో అందరికీ తెలుసు. ఇప్పుడు అచ్చెన్నాయుడు కూడా అదే డైలాగుల ఇమిటేషన్ లో మాట్లాడుతున్నాడు. కావాలంటే వైసీపీ ఆఫీసుకే వస్తా.. అంటూ సవాళ్లు విసురుతున్నాడు. కలబడడానికి కాదు గానీ.. తమ ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం చేపడుతున్న పనుల గురించి చర్చ పెట్టడానికట.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు సిద్ధమవుతుండే సరికి చంద్రబాబు కేబినెట్ లోని మంత్రులంతా ఒక్కొక్కరుగా యాక్టివేట్ అవుతున్నారు. జగన్ నుంచి ముందు ముందు ప్రతిరోజూ విమర్శల వెల్లువ తప్పదు గనుక.. ముందునుంచే వీరు జగన్ మీద వాగ్బాణాలు సంధించడంలో బిజీగా గడుపుతున్నారు. జగన్ కు పాదయాత్ర చేసే అర్హతే లేదని ఒకరు అంటోంటే.. ఆయన చేసినా తమకే లాభం అని మరొకరు అంటున్నారు. ఇలా వారి మాటల పర్వం సాగుతోంది. అయితే అచ్చెన్నాయుడు వ్యవహారం కొంత వెరైటీ గా ఉంది.
తమ ప్రభుత్వం బీసీల కోసం చాలా చేస్తున్నదట. ఆ విషయంలో వైసీపీ ఆఫీసుకు వచ్చి కావలిస్తే ఆయన చర్చ కు కూర్చుంటారట. తము చేస్తున్న పథకాల గురించి చెబుతారట. అయినా అంతగా సవాలు విసరదలచుకుంటే.. అందరూ పాదయాత్రకు వెళుతున్న వేళ ఆయన వైసీపీ ఆఫీసుకు వెళ్లడం కాదు.. జగన్ పాదయాత్ర ప్రదేశానికే వెళ్లి.. ఎక్కడైతే జగన్ విమర్శలు చేస్తాడో.. అక్కడికక్కడే ప్రతి విమర్శకూ సమాధానం చెప్పే ప్రయత్నం చేయవచ్చు కదా..! అని జనం అనుకుంటున్నారు.