Begin typing your search above and press return to search.
బీజేపీ పని సులభం చేస్తున్న నాస్తికులు, దళిత క్రిస్టియన్ యువకులు
By: Tupaki Desk | 3 Jan 2023 6:27 AM GMTతెలంగాణ మొదటి నుంచి భావతీవ్రతకు పెట్టింది పేరు. ప్రాంతీయవాదమైనా, నాస్తికవాదమైనా, విప్లవ భావజాలమైనా అక్కడ తీవ్రంగానే ధ్వనించాయి.. ప్రస్ఫుటించాయి. కొద్దికాలంగా తెలంగాణలో కొందరు యువతరం నాస్తికత్వం, హిందూ వ్యతిరేక వాదాన్ని తమ ఉపన్యాసాలలో, పాటలలో వినిపిస్తూ యువతను ఆకట్టుకుంటున్నారు. వీరిలో కొందరు స్థానికంగానే ఉండేవారైతే.. మరికొందరు గల్ఫ్ ప్రాంతాలలో పనిచేసి నాలుగు రాళ్లు వెనకేసుకొచ్చి తెలంగాణలో తమ పాటలు, భావజాలం వినిపిస్తూ యువతను ఆకట్టుకుంటున్నారు. వీరిలో నిఖార్సైన నాస్తికులు, నిఖార్సయిన హేతువాదులు ఉన్నారు.. అదేసమయంలో నాస్తికత ముసుగులో క్రైస్తవ మిషనరీలకు పనిచేసేవారూ ఉన్నారన్న ఆరోపణలున్నాయి. వీరిలో ఎవరు ఎవరనే గుట్టుమట్లు పక్కనపెడితే నాస్తిక యువతరం కాస్త హద్దు మీరి హిందూ వ్యతిరేక యువతరంగా తమ గళం వినిపిస్తుండడంతో తెలంగాణలో బీజేపీకి అది రాజకీయంగా కలిసొస్తోంది.
రీసెంటుగా నాస్తిక నాయకుడిగా చెప్తున్న బైరి నరేశ్ అనే యువకుడు అయ్యప్పపై చేసిన వ్యాఖ్యలు ఎలాంటి దుమారం రేపాయో తెలిసిందే. ఎన్నడూ లేనట్లుగా అయ్యప్ప భక్తులు ఈ ఉదంతంలో రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. దీంతో బైరి నరేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇది ఇంకా పూర్తిగా చల్లారకముందే రెంజర్ల రాజేశ్ అనే మరో యువకుడు సరస్వతి మాతపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీంతో తెలంగాణలోని సరస్వతి ఆలయం ఉన్న క్షేత్రం బాసరలో వర్తకులు, స్థానికులు నిరసన తెలుపుతున్నారు. బాసరలో అర్చకులు సైతం పూజల నిలిపివేసి బంద్‌లో పాల్గొని రెంజర్ల రాజేశ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రెంజర్ల రాజేశ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేయాలనీ కోరుతున్నారు అందరూ.
కాగా ఇటీవల బైరి నరేశ్.. అయ్యప్ప స్వామిపై వ్యాఖ్యలు చేసిన సమయంలో రెంజర్ల రాజేశ్ ఆ పక్కనే ఉన్న విషయాన్నీ అనేకమంది గుర్తు చేస్తున్నారు. అంతేకాదు... గొడవ ముదిరిన తరువాత బైరి నరేశ్ కు మద్దతుగా రెంజర్ల రాజేశ్ సోషల్ మీడియాలోనూ పోస్టులు పెట్టారు.
ఇదంతా వివాదంలో భాగం అయితే... ఇది రాజకీయంగా బీజేపీ కలిసొస్తున్న అంశమని విశ్లేషకులు అంటున్నారు. హిందూ దేవతలకు వ్యతిరేకంగా నరేశ్, రాజేశ్ వంటివారు చేస్తున్నవ్యాఖ్యల కారణంగా ప్రజల్లో హిందూత్వ, బీజేపీ వైపు మొగ్గు మరింత పెరుగుతోందని చెప్తున్నారు.
అయితే... ఇది బీజేపీకి ప్లస్ కాకుండా ఉండేలా కొన్ని రాజకీయ పార్టీల వైపు నుంచి కొత్త రకం ప్రచారం కూడా జరుగుతోంది. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రోద్బలంతోనే బైరి నరేశ్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో ఒక ప్రచారం ఎత్తుకున్నారు. బండి సంజయ్, బైరి నరేశ్‌లు కరీంనగర్‌లోని శ్వేత హోటల్లో భేటీ అయ్యారని.. ఆ తరువాతే నరేశ్ అయ్యప్ప స్వామిపై వ్యాఖ్యలు చేశారంటూ వాట్సాప్, ఫేస్ బుక్‌లో పోస్టులు కనిపిస్తున్నాయి. అయితే... ఈ వివాదాలు బీజేపీకి రాజకీయంగా లబ్ధి చేయకుండా ఉండేందుకే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని అర్థమవుతోంది.
కరీంనగర్‌లోని శ్వేత హోటల్‌కు యజమాని గంగుల కమలాకర్. ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే. బండి సంజయ్, కమలాకర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. అలాంటప్పుడు బండి సంజయ్ అంత అమాయకంగా గంగుల కమలాకర్ హోటల్‌లో బైరి నరేశ్ ను ఎలా కలుస్తారనేది చిన్నపిల్లాడికి కూడా వచ్చే ప్రశ్న.మొత్తానికైతే... ఒక బైరి నరేశ్.. ఒక రెంజర్ల రాజేశ్.. ఏదో చేయబోయి బీజేపీకి మేలు చేస్తున్నారన్నదైతే కాదనలేని సత్యం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.