Begin typing your search above and press return to search.
ఆత్మకూరు ఉప ఎన్నిక ఎకగ్రీవం కాదు.. దానికి కారణం ఎవరంటే?
By: Tupaki Desk | 1 Jun 2022 5:30 AM GMTదివంగత వైసీపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఆత్మకూరు ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. అనుకోని రీతిలో చోటు చేసుకున్న విషాదంతో పాటు.. పార్టీలకు అతీతంగా వ్యవహరించే గౌతమ్ రెడ్డి వ్యక్తిత్వం నేపథ్యంలో ఉప పోరు లేకుండా ఏకగ్రీవం అవుతుందని భావించారు.ఇందుకు తగ్గట్లే సంప్రదాయాన్ని అనుసరించి ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పోటీకి దూరంగా ఉండాలన్న నిర్ణయాన్ని అనధికారికంగా తీసుకోవటంతో పోరు ఉండదనే అనుకున్నారు.
అయితే..ఏపీలో ఎలాంటి బలం లేని బీజేపీ మాత్రం ఎన్నికకు సిద్ధం కావటంతో ఉప పోరు తప్పనిసరి అవుతుందని చెబుతున్నారు. ఇటీవల బద్వేలు ఉప పోరు సమయంలోనూ టీడీపీ పోటీకి దూరంగా ఉంది. అయితే.. సంప్రదాయాల కంటే ప్రజాస్వామ్య విధానాలకు తాము పెద్దపీట వేస్తామని చెప్పిన ఆ పార్టీ.. ఉప బరిలో దిగుతామని చెప్పింది. ఇదిలా ఉంటే అధికార వైసీపీ అభ్యర్థిగా ఎవరు ఉంటారన్నది ప్రశ్నగా మారింది.
తొలుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టికెట్ ను గౌతమ్ రెడ్డి సతీమణికి ఇచ్చేందుకు మొగ్గు చూపారు. అయితే.. గౌతమ్ రెడ్డి తండ్రి.. పార్టీ సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి మాత్రం టికెట్ ను తన కోడలి కంటే కూడా చిన్న కొడుకు విక్రమ్ రెడ్డికి ఇవ్వాలన్న ప్రతిపాదనను పెట్టారు. దీంతో.. మేకపాటి ప్రతిపాదనకు అనుగుణంగా.. ఆయన అభిమతానికి పెద్దపీట వేస్తూ టికెట్ ఆయన కోరినట్లే ఆయన కుమారుడికి ఇవ్వాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. దీంతో.. వైసీపీ అభ్యర్థిగా విక్రమ్ రెడ్డి కానున్నారు.
ఇక.. టీడీపీ విషయానికి వస్తే.. సిట్టింగ్ అభ్యర్థుల మరణంతో జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న విధానాన్ని కంటిన్యూ చేస్తూ ఉప పోరుకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు. అయితే.. బీజేపీ మాత్రం తమ అభ్యర్థిని బరిలోకి దించాలని భావిస్తోంది. ఆ పార్టీకి జనసేన మద్దతు ఇవ్వనుంది. బద్వేలు ఉప పోరులో దిగటంద్వారా మైండ్ గేమ్ ఆడాలన్నది కమలనాథుల ప్లాన్ గా చెబుతున్నారు.
ఇందుకువారు చెబుతున్న ఉదాహరణను చూస్తే..2019లో జరిగిన ఎన్నికల్లో బద్వేలులో బీజేపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు కేవలం 735 కాగా.. ఉప ఎన్నికల్లో మాత్రం తమ అభ్యర్థికి 21,678 వచ్చాయి. ఇదంతా తమకు పెరిగిన బలంగా క్లెయిం చేసుకుంటున్నారు.
వాస్తవానికి ప్రధాన ప్రతిపక్ష అభ్యర్థి బరిలో లేకపోవటం.. వైసీపీని వ్యతిరేకించే వారు.. ఆ పార్టీకి ఓటు వేసే అవకాశం ఉండదు. తప్పనిసరి పరిస్థితిలో మరో అప్షన్ లేకనే బీజేపీకి ఓటు వేశారని చెప్పాలి. అయితే.. దీనికి ఆ పార్టీ చెప్పుకునే భాష్యం మాత్రం వేరేలా ఉందని చెప్పాలి. త్వరలో జరిగే ఆత్మకూరు ఉప పోరు తర్వాత కూడా బీజేపీ తనకు పడిన ఓట్ల లెక్క చూపించి.. తాము బలపడినట్లుగా ప్రచారం చేసుకోవటం ఖాయమంటున్నారు. నిజానికి అందుకే ఉప బరిలో దిగనున్నట్లుగా చెప్పొచ్చు.