Begin typing your search above and press return to search.

ఛత్తీస్‌ గఢ్‌ లో దారుణం..16 ఏళ్ల బాలికపై ఆరుమంది గ్యాంగ్ రేప్ ..తండ్రి , నాలుగేళ్ల చిన్నారిని ...!

By:  Tupaki Desk   |   4 Feb 2021 9:45 AM GMT
ఛత్తీస్‌ గఢ్‌ లో దారుణం..16 ఏళ్ల బాలికపై ఆరుమంది గ్యాంగ్ రేప్ ..తండ్రి , నాలుగేళ్ల చిన్నారిని ...!
X
ఛత్తీస్ ‌గఢ్ ‌లో దారుణం చోటు చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలికపై ఆరుమంది మానవ మృగాలు గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారు. చిత్ర హింసలు పెట్టారు. ఆ తర్వాత ఆమెను రాళ్లతో కొట్టి చంపేశారు. ఆమె తండ్రి, నాలుగేళ్ల అక్క కుమార్తెనూ దారుణంగా హత్య చేశారు. ఛత్తీస్‌ గఢ్‌ లోని కోర్బా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇకపోతే, ఈ దారుణానికి పాల్పడిన ఆరుమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్బా జిల్లాలోని గాధుప్రోడా గ్రామంలో కిందటి నెల 29వ తేదీన అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన , కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టిన తరువాత గానీ ఈ విషయం బయటి ప్రపంచానికి తెలియరాలేదు. ఈ కేసులో ప్రధాన నిందితుడు, మృతురాలి కుటుంబానికి పరిచయస్తుడే.

తండ్రి, నాలుగేళ్ల మనవరాలిని తన బైక్‌ పై ఇంటి వద్ద డ్రాప్ చేయడానికి వెళ్లాడు. ఊరికి దూరంగా ఉంటోన్న ఆ ఇంట్లో ఆ ముగ్గురే నివసిస్తున్నట్లు తెలుసుకున్నాడు. అదే రోజు రాత్రి అయిదు మంది స్నేహితులతో కలిసి ఆ బాలిక ఇంటికి వెళ్లాడు. ఆమెముందే తండ్రి, నాలుగేళ్ల మనవరాలిని దారుణంగా హత్య చేశారు.

ఆమెపై గ్యాంగ్ ‌రేప్ ‌కు పాల్పడ్డారు. అనంతరం బాధితురాలిని రాళ్లతో కొట్టి చంపారు. ముగ్గురి మృతదేహాలను అక్కడే పాతిపెట్టారు. మారుమూల గ్రామం కావడం వల్ల ఈ విషయం వెంటనే వెలుగులోకి రాలేదు. వారి బంధువులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దర్యాప్తు సందర్భంగా అసలు విషయం వెల్లడైంది. ఈ కేసులో సంత్రం మఝ్వార్, అబ్దుల్ జబ్బార్, అనిల్ కుమార్ సారథి, పర్దేశి రామ్ పనిక, ఆనంద్ రామ్ పనిక, ఉమాశంకర్ యాదవ్‌ లను అరెస్ట్ చేశారు.

వారందరూ గోధుప్రాడా పొరుగునే ఉన్న సంత్రెనకు చెందిన వారిగా గుర్తించినట్లు కోర్బా పోలీస్ సూపరింటెండెంట్ అభిషేక్ మీనా తెలిపారు. బర్పానీలో నివసిస్తోన్న మృతురాలి కుటుంబాన్ని పని ఇప్పిస్తానని ఆశచూపి, గాధుప్రోడాలో ఇంట్లో ఉంచాడని, అదే రోజు రాత్రి ఘాతుకానికి పాల్పడ్డాడని ఆయన తెలిపారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.