Begin typing your search above and press return to search.
ఏపీలో దారుణంః భార్య నగ్న వీడియో చూసి..
By: Tupaki Desk | 24 May 2021 12:30 AM GMTకామంతో కళ్లు మూసుకుపోయిన ఓ దుర్మార్గుడు చేసిన పనికి.. నిండు ప్రాణం బలైపోయింది. ఈ దారుణ సంఘటన ఏపీలోని కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. వీరవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళ స్నానం చేస్తున్న వీడియోను షూట్ చేశాడు అదే గ్రామానికి చెందిన ఓ కామంధుడు. ఆమెపై చాలాకాలంగా కన్నేసిన అతడు.. ఈ వీడియో తీసి గ్రామంలోని మిగిలిన వారికి కూడా షేర్ చేశాడు.
ఈ విషయం బాధితురాలి భర్తకు తెలిసింది. దీంతో.. తీవ్ర మనస్థాపానికి గురైన కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే.. పోలీసులు సమయానికి స్పందించలేదని సమాచారం. ఈ నెల 18వ తేదీన కంప్లైంట్ ఇచ్చినప్పటికీ.. ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.
అంతేకాకుండా.. సదరు నిందితుడు బాధితురాలి భర్తను చంపేస్తానని బెదిరించాడట. తనపై పోలీసు కేసు పెట్టినందుకు ఇష్టమొచ్చినట్టు దూషించాడని సమాచారం. అటు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టలేదని, ఇటు నిందితుడు బెదిరించడంతో.. మరింత ఆవేదనకులోనై ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహంతో గ్రామంలో ఆందోళన చేశారు. బాధితురాలి భర్త మరణం తర్వాత పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.