Begin typing your search above and press return to search.
పది మంది కలిసి రేప్ చేసి.. ఆ వీడియోను నెట్ లో ఉంచేశారు!
By: Tupaki Desk | 9 March 2021 1:30 PM GMTదారుణాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఒక దారుణానికి మించిన మరో దారుణం వెంట వెంట తెరపైకి వస్తున్నాయి. ఇలాంటి వారి విషయంలో కఠినంగా శిక్షలు పడితే తప్పించి.. ఈ నేరాలకు చెక్ పడే అవకాశం కనిపించటం లేదు. తాజాగా వెలుగు చూసిన దారుణం ఈ కోవలోకి చెందిందే. ఒక మహిళను పది మంది కలిసి గ్యాంగ్ రేప్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను నెట్ లో అప్ లోడ్ చేసిన వైనం షాకింగ్ గా మారింది.
ఈ దారుణం గత ఏడాది జైపూర్ లో జరిగినట్లుగా భావిస్తున్నారు. జైపూర్ లోని మాన్స రోవర్ ప్రాంతంలో ఒక సెక్సు వర్కర్ పై పది మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియోను అప్ లోడ్ చేశారు. ఇది కాస్తా వైరల్ గా మారటంతో పోలీసులు అప్రమత్తమై.. దాన్ని డిలీట్ చేయించారు. అందులోని మహిళ వద్ద నుంచి వివరాలు సేకరించారు.
ఆమె ఇచ్చిన వివరాల ప్రకారం ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేశారు. వారు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన వారిగా గుర్తించారు. ఈ దారుణంలో పాలు పంచుకున్న ఇద్దరితో పాటు.. వీడియో తీసిన వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని.. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఇలాంటి దారుణాలకు పాల్పడే వారిని ఉత్తినే వదిలేయకుండా.. తప్పు చేయాలన్న ఆలోచనే వణుకు పుట్టేలా శిక్షలు పడాలన్న డిమాండ్ పలువురి నోట వినిపిస్తోంది.