Begin typing your search above and press return to search.

బిడ్డ ఎదురుగానే తల్లిపై సైనికులు అత్యాచారం!

By:  Tupaki Desk   |   1 April 2022 2:30 AM GMT
బిడ్డ ఎదురుగానే తల్లిపై సైనికులు అత్యాచారం!
X
యుద్ధంతో అతలాకుతలం అవుతున్న ఉక్రెయిన్ లో ఇప్పుడు అత్యంత దారుణాలు వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా మహిళల పరిస్థితి దారుణంగా తయారవుతోంది. ఉక్రెయిన్ లో ఓ మహిళకు ఘోర అవమానం ఎదురైంది. బిడ్డ ఎదురుగానే ఆ మహిళ సామూహిక అత్యాచారానికి గురైంది. ఆ మహిళ భర్తను చంపేసిన రష్యా సైనికులు నాలుగేళ్ల చిన్నారి ఎదురుగానే మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ మహిళ తాను ఎదుర్కొన్న దారుణ పరిస్థితి గురించి మీడియా ఎదుట వాపోయింది.

రష్యా సైనికులు మా ఇంటి గేటు తెరుచుకొని సైనికులు లోపలికి వచ్చారని.. అప్పటికే నా పెంపుడు కుక్కను చంపేశారని.. గేటు దగ్గర నా భర్త శవమై పడి ఉన్నాడని మహిళ వాపోయింది. నాకు ఏడుపు తన్నుకొచ్చిందని.. నా గుండె ఆగిపోయినంత పని అయ్యిందన్నారు. ఆ సమయంలో ఇద్దరు రష్యన్ సైనికులు నా అత్యాచారానికి పాల్పడ్డారని సదురు మహిళా వాపోయింది. అదే గదిలో నా నాలుగేళ్ల బిడ్డ గుక్కపట్టి ఏడుస్తున్నాడని.. నా బిడ్డ ఏడుపు ఆపించి మరీ మళ్లీ నన్ను రమ్మన్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తర్వాత నన్ను చంపకుండా వదిలేసి వెళ్లిపోయారని ఆ మహిళ మీడియా ఎదుట కన్నీళ్లతో వాపోయింది.

తాను కూడా చనిపోతే తన కుమారుడు ఒంటరి అయిపోతాడని.. అందుకే ఆత్మహత్య చేసుకోలేదని మహిళ చెప్పిన మాటలు ఎంతో మందిలో తీవ్ర విషాదాన్ని నింపాయి. తన భర్త శవాన్ని అలాగే వదిలేసి కొడుకుతో సహా పారిపోయి వచ్చానని.. ఆ ప్రాంతం రష్యా సైనికుల ఆధీనంలో ఉండడంతో తన భర్త మృతదేహాన్ని ఖననం చేయడం కుదరదని ఆ మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

ఉక్రెయిన్ యుద్ధం ఎన్నో విషాదాలను నింపుతోంది. ఎన్నో పగలు, ప్రతీకారాలకు వేదిక అవుతోంది. రోజుకో కథ బయటకు బయటపడుతోంది. ఒకప్పుడు హిట్లర్ సైన్యం నుంచి తప్పించుకున్నా ఓ ధీరుడు ఇప్పుడు పుతిన్ యుద్ధ దాహానికి బలైపోయాడు. ఎంతో మంది మహిళలు మాన ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్నారుల మరణాలు వేల సంఖ్యలో ఉంటున్నాయి. రష్యా బాంబు దాడులకు దేశం ఖాళీకాగా.. ఉన్నవాళ్లు అంతా బలైపోతున్నారు.