Begin typing your search above and press return to search.
విజయవాడలో దారుణం.. ఎలక్ట్రిక్ బైక్ పేలిపోయి.. వ్యక్తి మృతి!
By: Tupaki Desk | 23 April 2022 1:49 PM GMTఎలక్ట్రిక్ బైకులు.. పర్యావరణ పరిరక్షణ కోసం.. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ద్విచక్రవాహనాలు. గత మూడేళ్లుగా ఈ 'ఈబైక్'లకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. అయితే.. అప్పట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. ఇటీవల కాలంలో పెట్రోల్ ధరలు ఆకాశానికి అంటుతుండ డంతో ఖరీదు ఎక్కువైనా.. వీటిని వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. వీటిని విద్యుత్ చార్జింగ్ చేస్తే.. గంటకు 30 నుంచి 35 కిలోమీటర్ల దూరం ప్రయాణించే వెసులుబాటుంది.
దీంతో ఖర్చు తక్కువ కావడంతో.. వీటిని కొంటున్నారు. అయితే.. ఇప్పుడు ఇవే వినియోగదారుల ప్రాణాలకు ప్రమాదాలు తెస్తున్నాయి. ఇటీవల కాలంలో తరచుగా.. బ్యాటరీలు పేలిపోవడం..చార్జింగ్ పెడుతున్న సమయంలో షాక్ కొట్టడం.. వంటివి దేశంలో చాలా చోట్ల వెలుగు చూశాయి.
ఇప్పుడుతాజాగా.. ఏపీలోని విజయవాడలో ఘోరం చోట చేసుకుంది. నగరంలోని సత్యనారాయణపురం గులాబీ తోటలో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి ఒకరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
శివకుమార్ అనే వ్యక్తి శుక్రవారం కొత్త CORBETT14 ఎలక్ట్రిక్ బైక్‌ను కొనుగోలు చేశాడు. ఎలక్ట్రిక్ బైక్‌కు వచ్చిన బ్యాటరీ ఇంటిలోని పడుకునే గదిలో చార్జింగ్ పెట్టాడు. అయితే తెల్లవారుజామున బ్యాటరీ పేలి ఇల్లు మొత్తం మంటలు వ్యాపించాయి. శివ కుమార్‌తో పాటు భార్య, ఇద్దరూ పిల్లలు మంటల్లో చిక్కుకుపో యారు. పెద్ద ఎత్తున మంటలు, పొగ రావడంతో చుట్టు పక్కల వారు చూసి తలుపులు పగలగొట్టి ఇంట్లో వారిని బయటకు తీసుకువచ్చారు.
అందరికీ తీవ్ర గాయాలతో పాటు శరీరం కాలి పోవడంతో వెంటనే 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. కాగా మార్గ మధ్యలో శివ కుమార్ మృతి చెందగా భార్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి.
పిల్లలను మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇదిలావుంటే.. ఎలక్ట్రిక్ వాహనాల్లో బ్యాటరీలు పేలిపోయిన ఘటనపై రెండు రోజుల కిందటే కేంద్రం కూడా దృష్టి పెట్టింది ఇలా జరిగితే.. కంపెనీల లైసెన్సులు క్యాన్సిల్ చేస్తామని.. పేర్కొంది. మరి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. అయితే.. సుస్థిరాభివృద్ధి లక్ష్యమైన 2030 నాటికి ఈ బైక్‌లుతేవాలన్న.. మోడీ లక్ష్యం ఇలాంటి ఘటనలతో సాకారం అయ్యేనా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.