Begin typing your search above and press return to search.
షర్మిలపై అట్రాసిటీ కేసు.. ఇప్పటికైనా కూల్ అవుతుందా?
By: Tupaki Desk | 4 Oct 2022 5:30 PM GMT‘దమ్ముంటే తనపై కేసులు నమోదు చేయండి.. కావాలంటే అరెస్ట్ చేసుకోండి.. నడుచుకుంటూ జైలుకు వస్తానని’ ప్రెస్ మీట్ కు బేడీలు తీసుకొచ్చి మరీ తొడగొట్టింది వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఆమె ముచ్చట ఇప్పుడు తీరేలా ఉంది. ఎందుకంటే వైఎస్ షర్మిలపై అట్రాసిటీ కేసు నమోదైంది. షర్మిల నోటి దురుసు వల్లే ఈ కేసు నమోదు కావడం విశేషం.
పాదయాత్రలో భాగంగా ఏ నియోజకవర్గానికి వెళితే ఆ ఎమ్మెల్యేపై తిట్టిపోస్తున్న షర్మిల హద్దులు దాటి మరీ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై నోరుపారేసుకొని అదే స్థాయిలో ఆయన చేతిలో అనరాని మాటలన్నీ పడ్డారు.
తాజాగా ఆంథోల్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తే టీఆర్ఎస్ దళిత ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ను అవమానించేలా షర్మిల మాట్లాడారు. అసలే దళిత సామాజికవర్గం.. ఊరుకుంటారా? షర్మిలపై జోగిపేట పోలీస్ స్టేషన్ లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.
మొన్నటివరకూ తనను అరెస్ట్ చేయండి.. దమ్ముంటే లోపలేయండి అని బీరాలు పలికిన షర్మిల ముచ్చటను కూడా గులాబీ శ్రేణులు తీర్చారు. ఇప్పుడు కేసు నమోదయ్యాక షర్మిల మాట మార్చారు. ‘ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అవినీతిని ప్రశ్నిస్తే తప్పా? ప్రశ్నిస్తే కేసులు పెడుతారా?’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.కేసులు పెట్టాలని కోరుకొని ఇప్పుడు పెట్టిన తర్వాత గోల పెట్టడం ఏంటో షర్మిలకే తెలియాలి.
రాజకీయంగా ఉనికి కాపాడుకునేందుకు షర్మిల చేయరాని ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. కేసులపైన తొడగొట్టారు. తాజాగా కేసులు నమోదయ్యే సరికి వలవల ఏడుస్తున్నారు. అలా భయపడేవారే అయితే నోరుపారేసుకోవడం ఎందుకు.. కేసుల పాలయ్యాక ఈ ఏడ్వడం ఎందుకని పలువురు టీఆర్ఎస్ శ్రేణులు ఎద్దేవా చేస్తున్న పరిస్థితి నెలకొంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.