Begin typing your search above and press return to search.

65 ఏళ్ల ఏషియన్‌ అమెరికన్‌ పై దాడి .. బైడెన్ ఆగ్రహం !

By:  Tupaki Desk   |   31 March 2021 9:34 AM GMT
65 ఏళ్ల ఏషియన్‌ అమెరికన్‌ పై దాడి ..  బైడెన్ ఆగ్రహం !
X
అగ్రరాజ్యం అమెరికాలో ఏషియన్ అమెరికన్లపై దాడులు రోజు రోజకు పెరిగిపోతున్నాయి. ఈ మద్యే అట్లాంటాలో ఏషియన్ మసాజ్ పార్లర్లే లక్ష్యంగా దాడికి పాల్పడి ఎనిమిది మందిని అన్యాయంగా పొట్టనపెట్టుకున్న. ఇదిలా ఉంటే తాజాగా న్యూయార్క్ లో 65 ఏళ్ల ఏషియన్‌ అమెరికన్‌ వృద్ధురాలిపై ఓ దుండగుడు దాడి చేశాడు. కనీసం వృద్ధురాలు అనే జాలి కూడా లేకుండా కిందపడేసి పదేపదే కడుపు భాగంలో కాలితో తన్నాడు.దీనితో ఆమె విలవిల్లాడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో వైరల్ ‌గా మారింది. ఈ ఘటనను ట్విటర్ వేదికగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సోమవారం ఉదయం 11.30 గంటలకు మాన్ ‌హాటన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ దుకాణం ముందు నుంచి వృద్ధురాలు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఆమెకు ఎదురుగా వచ్చిన దుండగుడు మొదట ఆమెను ఒక్కసారిగా కాలితో తన్ని కిందపడేశాడు. ఆ తర్వాత కిందపడిపోయిన ముసలావిడ కడుపు భాగంలో పదేపదే కాలితో తన్నాడు. దీంతో ఆమె నేలపై పడి విలవిల్లాడిపోయింది. అనంతరం అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా, దాడి సమయంలో దుండగుడు ఆసియాకు వ్యతిరేక నినాదాలు చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించారు.

ఏషియన్ అమెరికన్లపై జరుగుతున్న హింసాత్మక ఘటనలపై అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై జరుగుతున్న దాడులను ఇకపై చూస్తూ ఊరుకుబోమని బైడెన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనలపై విచారణకు ప్రత్యేక విభాగాన్ని సైతం ఏర్పాటు చేసినట్లు ట్వీట్ చేశారు. విచారణ అనంతరం నిందితులపై కఠిన చర్యలు ఉంటాయని బైడెన్ అన్నారు. ఇదిలా ఉంటే.. 2020 మార్చి 19 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకూ హేట్‌ క్రైమ్‌‌ కు సంబంధించి మొత్తం 3,795 కేసులు నమోదైనట్లు 'స్టాప్‌ ఏషియన్‌ అమెరికన్‌ పసిఫిక్‌ ఐలాండర్స్‌ హేట్‌' సంస్థ వెల్లడించింది. అలాగే ఈ ఏడాదిలో ఇప్పటివరకూ ఒక్క న్యూయార్క్‌ లోనే ఆసియా వాసులపై దాడుల నేపథ్యంలో 33 కేసులు నమోదయ్యాయని వెల్లడించింది.