Begin typing your search above and press return to search.
జర్నలిస్ట్ పై దాడి.. సల్మాన్ ఖాన్ కు కోర్టు సమన్లు
By: Tupaki Desk | 23 March 2022 8:30 AM GMTబాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు ఉన్న పాపులారిటీ తెలిసిందే. ఆయన సినిమాలతోనే కాకుండా వివాదాలతో సైతం వార్తల్లో నిలుస్తుంటాడు. ఈ నటుడు కొన్నేళ్ల క్రితం కృష్ణ జింకలను వేటాడిన కేసు ఇంకా నడుస్తూనే ఉంది. తాజాగా మరో కేసులో సల్మాన్ పై కోర్టు సమన్లు జారీ చేసింది.
సల్మాన్ ఖాన్ తో తనతో అనుచితంగా ప్రవర్తించాడని.. దాడి చేశాడని అశోక్ పాండే అనే జర్నలిస్ట్ 2019లో ముంబైలో కేసు దాఖలు చేశారు.
ఆ కేసును విచారించిన అంథేరి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు మార్చి 22న ఈ బాలీవుడ్ నటుడికి సమన్లు జారీ చేసింది.
ఐపీసీ సెక్షన్లు 504,506 కింద నేరాలకు సంబంధించి విచారణ కోసం ఏప్రిల్ 5న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. అసలు ఈ వివాదానికి కారణం ఒక వీడియో అని సమాచారం.
సల్మాన్ ఖాన్, తన అంగరక్షకుడితో కలిసి సైకిల్ పై వెళుతున్నప్పుడు దాన్ని చిత్రీకరించేందుకు ఓ జర్నలిస్ట్ ప్రయత్నించాడు. దీంతో సీరియస్ అయిన సల్మాన్ తనపై దాడి చేశారని జర్నలిస్ట్ అశోక్ పాండే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ సంఘటన ఏప్రిల్ 24,2019న జరిగింది. తాను వీడియో తీసే ముందు సల్మాన్ ఖాన్ అనుమతి తీసుకున్నట్టు అందులో పేర్కొన్నాడు.