Begin typing your search above and press return to search.
అంబేద్కర్ ఇంటిపై దుండగుల దాడి !
By: Tupaki Desk | 8 July 2020 12:50 PM GMTభారత రాజ్యాంగ నిర్మాత డా. అంబేద్కర్ ఇంటిపై గుర్తుతెలియని కొందరు దుండగులు దాడి చేసారు. మంగళవారం సాయంత్రం ముంబైలోని దాదర్ హిందూ కాలనీలో ఉన్న రాజ్ గృహాలోని మూడంతస్థుల ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు వరండాలో ఉన్న పూల కుండీలను ధ్వంసం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనను మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఖండించారు. ఈ సంఘటనపై తక్షణమే దర్యాపు చేయాలని పోలీసులును ఆదేశించామని, నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని ట్వీట్ చేశారు. ఈ ఉదంతంపై విచారణకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల్ని పట్టుకునేందుకు పెద్ద ఎత్తున గాలింపు చర్యల్ని చేపట్టారు.
అంబేద్కర్ ముంబై లో స్థిరపడిన తరువాత 1930లో ఈ మూడు అంతస్తుల భవనం నిర్మించారు. ప్రస్తుతం ఇది హెరిటేజ్ మ్యూజియంతో పాటు స్మారక చిహ్నంగా ఉంది. ఇందులో మొదటి అంతస్తు వరకు అంబేద్కర్ వ్యక్తిగత వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. మిగితా రెండు అంతస్తులు ఆయన వారసులు వాడుతున్నారు. ప్రతి రోజూ ఇక్కడ సందర్శకులకు అనుమతి ఉంటుంది. అదేవిధంగా అంబేద్కర్‌పై పరిశోధనలు చేయాలకునేవారికి రాజగృహ ఒక ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్నది. కానీ ఇటీవల లాక్ డౌన్ కారణంగా మ్యూజియం మూసివేశారు. ఎవరూ లేని సమయం చూసి దాడికి తెగబడటం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి, అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.