Begin typing your search above and press return to search.
టీడీపీ అధినేత చంద్రబాబుపై దాడికి యత్నం.. నందిగామలో ఉద్రిక్తత
By: Tupaki Desk | 4 Nov 2022 3:36 PM GMTతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై దాడికి యత్నం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. ‘బాదుడే బాదుడు’ నిరసన రోడ్ షో నిర్వహిస్తోన్న సమయంలో చంద్రబాబుపై గుర్తు తెలియని వ్యక్తి విసిరాడు. ఈ ఘటనలో చంద్రబాబు పక్కనే ఉన్న ఆయన ప్రధాన భద్రతా అధికారి మధుబాబుకి గాయమైంది. మధుబాబు గడ్డం కింద గాయమై రక్తస్రావం కావడంతో వెంటనే వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. రాయి విసిరిన ఘటనతో ఎన్ఎస్.జీ కమాండోలు అప్రమత్తమయ్యారు.
12మంది బృందంతో కూడిన కమాండోలు భద్రత కట్టుదిట్టం చేశారు. రోడ్ షో త్వరగా ముగించాలని పోలీసులు ఒత్తిడి చేశారు. చంద్రబాబు వాహనం ముందు, వెనుక పెద్ద ఎత్తున రోప్ పార్టీలు ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తగా చంద్రబాబు వాహనం చుట్టూ అదనపు భద్రా దళాలు మోహరించాయి.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘కొందరు అసమర్థులు దొంగల మాదిరిగా రాయి విసిరాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ గుండాలూ.. ఖబడ్ధార్ అంటూ హెచ్చరించారు. వైసీపీ రౌడీలకు భయపడేది లేదని తేల్చిచెప్పారు.
పులివెందుల రాజకీయాలకు చేయొద్దని జగన్ ను కోరుతున్నా.. జగన్ పరిపాలనలో మీ పిల్లలకు భవిష్యత్ ఉండదు. యువతకు మంచి భవిష్యత్తు ఇచ్చేది ఆ పార్టీయే. జగన్ పాలనలో నిత్యావసరాల ధరలు బాగా పెరిగాయి. వైసీపీ పాలనలో ఇసుక మద్యం కుంబకోణాలు, వచ్చే ఎన్నికల్లో జగన్ సాగనంపడం ఖాయమని హెచ్చరించారు. సాగు మోటార్లకు మీటర్లు అంటే రైతుల మెడకు ఉరితాడే. పేదవారికి తిండిపెట్టే అన్న క్యాంటీన్లు ఏం తప్పు చేశాయి? అని విమర్శించారు.
కాగా చంద్రబాబుకు నందిగామలో ఘన స్వాగతం లభించింది. విద్యార్థులు చంద్రబాబు వైపు నిలబడి మద్దతు తెలిపారు. బాబు రోడ్ షోకు అనూహ్య స్పందన లభించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.