Begin typing your search above and press return to search.

మొన్న గాంధీలో..నేడు ఉస్మానియాలో..డాక్టర్లపై కరోనా బాధితుల దాడి!

By:  Tupaki Desk   |   14 April 2020 1:14 PM GMT
మొన్న గాంధీలో..నేడు ఉస్మానియాలో..డాక్టర్లపై కరోనా బాధితుల దాడి!
X
కరోనావైరస్ దేశ వ్యాప్తంగా విజృంభిస్తుంది. తెలంగాణలో కూడా రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దీనితో రాష్ట్ర ప్రజలలో అలజడి మొదలైంది. మరోవైపు రాష్ట్రంలో కరోనా విజృంభించకుండా ప్రభుత్వం కఠిన నియమాలని అమలు చేస్తుంది. అలాగే డాక్టర్లు - పోలీసులు - అధికారులు ప్రాణాలని పనంగా పెట్టి మరి కరోనా పై యుద్ధం చేస్తున్నారు. అయితే , అక్కడక్కడా పోలీసులు - డాక్టర్ల పై కరోనా భాదితులు దాడికి దిగుతున్నారు.

గాంధీ హాస్పిటల్‌ లో కరోనా రోగులు వైద్యులపై దాడికి దిగితే, ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్‌ లోనూ అదే సీన్‌ రిపీట్ అయినట్టు సమాచారం. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో రెండు పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. అనుమానితులను - రోగులను ఒకే చోట ఉంచడంపై అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఐసోలేషన్‌ వార్డులో ఉన్న పీజీలపై కరోనా బాధితులు దాడి చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా బాధితులు ఎవరూ సహనం కోల్పోకూడదని - అందరూ సంయమనం పాటించాలని పెద్దలు ఎంతగా చెప్పినా వినడం లేదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఈ విషయం చెప్పారు. ఈ సమయంలో డాక్టర్లు దైవంతో సమానమని - వారిని ఇబ్బంది పెట్టవద్దని సీఎం చెప్పినా కూడా , ఇటువంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయి. డాక్టర్ల పై దాడికి దిగితే ..వారు చేతులెత్తేస్తే మనల్ని కాపాడేవారే లేరు అన్న విషయాన్ని మనసులో పెట్టుకొని మెలిగితే మంచింది.