Begin typing your search above and press return to search.

మృత్యుంజ‌యురాలు..రెండు బుల్లెట్లు త‌గిలినా బ‌తికేసింది!

By:  Tupaki Desk   |   24 May 2020 8:28 AM GMT
మృత్యుంజ‌యురాలు..రెండు బుల్లెట్లు త‌గిలినా బ‌తికేసింది!
X
అఫ్గానిస్తాన్‌ లో ఉగ్రవాదుల దాడులు త‌ర‌చూ చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఈ క్ర‌మంలో మే 13వ తేదీన ఆ దేశ రాజ‌ధాని కాబూల్‌ లో దారుణ ఘ‌ట‌న జ‌రిగింది. కాబూల్‌ లోని ప్ర‌సూతి (మెట‌ర్నిటీ) ఆస్ప‌త్రి ల‌క్ష్యంగా తుపాకుల వ‌ర్షం కురిపించారు. ఈ క్ర‌మంలో పిల్ల‌ల త‌ల్లుల‌ను తుపాకీతో వేటాడారు. దీంతో ఆస్ప‌త్రి ప్రాంగ‌ణ‌మంతా హృద‌య విదార‌కంగా మారింది. అప్పుడే పుట్టిన చిన్నారుల‌ను కూడా మాన‌వ‌త్వం మ‌రిచి మ‌రి దాడుల‌కు పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో 16 మంది బ‌ల‌య్యారు. వారిలో త‌ల్లుల‌తో పాటు ఆస్ప‌త్రి వైద్య సిబ్బంది కూడా ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌లో ఓ చిన్నారిపై కూడా తుపాకీతో కాల్చారు. ఒక‌టి గుండెపై.. మ‌రోటి కాలిపై బుల్లెట్లు త‌గిలాయి.

ఆ ఆస్ప‌త్రిలో ర‌ఫీవుల్లాకు అప్పుడే పాప పుట్టింది. పేరు కూడా పెట్టారు.. అమీనా అని. మిలిటెంట్లు దాడి చేసిన స‌మ‌యంలో ఆ చిన్నారి కాలిలోకి రెండు బులెట్లు దిగబడ్డాయి. ఆ దాడి స‌మ‌యంలో బ‌య‌ట ఉన్న తండ్రి ర‌ఫీవుల్లా కొద్దిసేప‌టికి ఆస్ప‌త్రి లోపలికి వెళ్లాడు. అక్క‌డ ర‌క్త‌పాతం.. ప‌రిస్థితి దారుణంగా ఉంది. ఆ దాడిలో ఆ చిన్నారి త‌ల్లి తూపాకీ తూటాకు బ‌ల‌య్యింది. ఆ త‌ల్లిపై గుండెలో - కాలి మీద కాల్పులు జరిపారు. ఆ స‌మ‌యంలో ఆమె పొత్తిళ్ల‌లో చిన్నారి అమీనా పొదిగి ఉంది. వెంట‌నే స్పందించిన తండ్రి ర‌ఫీవుల్లా చిన్నారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆస్ప‌త్రిలో వైద్యులు చిన్నారికి అతిక‌ష్ట‌మ్మీద స‌ర్జ‌రీ చేసి బ‌తికించారు. దీంతో ఆ తండ్రికి ఒక ప‌క్క ఆనందం.. మ‌రో ప‌క్క ఆ పాప‌కు త‌ల్లి లేద‌నే బాధ ఉంది. అయితే ఈ ఘ‌ట‌న‌లో రెండు బ‌ల్లుట్లు త‌గిలినా చిన్నారి కోలుకోవ‌డం చూస్తుంటే మృత్యుంజ‌యురాలిగా అంద‌రూ పేర్కొంటున్నారు.