Begin typing your search above and press return to search.
షాకింగ్: జగన్ పై హత్యాయత్నం
By: Tupaki Desk | 25 Oct 2018 8:03 AM GMTఊహించని పరిణామం చోటు చేసుకుంది. విశాఖపట్నం ఎయిర్ పోర్ట్‌లో ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఒక వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డారు. సెల్ఫీ తీసుకుంటానని వచ్చిన ఒక యువకుడు కోడి పందెలకు ఉపయోగించే కత్తితో దాడికి ప్రయత్నం చేశారు.
ఈ ఘటనలో జగన్ ఎడమ భుజానికి స్వల్ప గాయమైంది. ఈ పరిణామంతో భద్రతా సిబ్బంది ఒక్కసారి షాక్ తిన్నారు. వెంటనే.. ఆ వ్యక్తిని ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. జగన్ పై దాడి చేసిన వ్యక్తి ఎయిర్ పోర్ట్ లోని రెస్టారెంట్ లో పని చేసే వెయిటర్ గా గుర్తించారు.
ప్రస్తుతం విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్.. శుక్రవారం నాంపల్లి కోర్టు వాయిదాకు హాజరయ్యేందుకు విశాఖ నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. ఇందులో భాగంగా ఆయన విశాఖ ఎయిర్ పోర్ట్ కు వచ్చారు. విమానం బయలుదేరటానికి సమయం ఉండటంతో వీఐపీ లాంజ్ లో ఆయన వెయిట్ చేస్తున్నారు.
ఆ సమయంలో జగన్ వద్దకు వచ్చిన వెయిటర్ ఆయనతో మాట్లాడుతూనే.. చిన్నకత్తితో ఆయనపై దాడి చేశారు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది నిందితుడ్ని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన జరిగిన వెంటనే విమానాశ్రయాన్ని మూసివేశారు. మరోవైపు.. జగన్ భుజానికి అయిన గాయానికి వైద్యులు చికిత్స చేశారు. ఆనంతరం ఆయన హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లారు. జగన్ పై కత్తితో దాడి చేసిన వ్యక్తిని శ్రీనివాస్ గా గుర్తించారు. అతడికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.