Begin typing your search above and press return to search.

అమరావతి లో జర్నలిస్టుల పై దాడి ... దాడి చేసింది నిజంగా రైతులేనా !

By:  Tupaki Desk   |   27 Dec 2019 7:52 AM
అమరావతి లో జర్నలిస్టుల పై దాడి ... దాడి చేసింది నిజంగా రైతులేనా !
X
అమరావతి లో తీవ్ర ఉద్రికత్త చోటు చేసుకుంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దీక్ష కవరేజ్‌ చేస్తున్న జర్నలిస్టులపై కొందరు వ్యక్తులు దాడికి దిగారు. మరో మీడియా ప్రతినిధి పైనా కూడా దాడి చేశారు. మీడియా ప్రతినిధుల పైన దాడిని అడ్డుకునేందుకు యత్నించిన పోలీసుల పై కూడా కొందరు దాడికి తెగబడినట్టు గా తెలుస్తోంది. ఓ చానల్‌ కు చెందిన మహిళా జర్నలిస్ట్‌ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆందోళన చేస్తున్న వారికి అనుకూలం గా వార్తలు ప్రసారం చేయడం లేదంటూ పలు చానళ్ల పై దాడికి దిగారు.

దీనితో ఆ మహిళా జర్నలిస్టు అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు వాహనంలో ఎక్కగానే ఆ వాహనాన్ని ఒకేసారి 40 మంది చుట్టు ముట్టారు. పెద్దపెద్ద కర్రల తో కారు అద్దాలని పగలకొట్టారు. పోలీసులు అతికష్టం మీద ఆమెతో పాటు మరో ఇద్దరిని వాహనం నుంచి బయటకు తీసుకొచ్చారు. రైతుల ముసుగు లో అసాంఘిక శక్తులు ప్రవేశించాయని పోలీసులు అనుమానిస్తున్నారు. శాంతి భద్రతల సమస్య ను సృష్టించేందుకు కుట్ర చేశారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడిలో ముగ్గురు జర్నలిస్టులు తీవ్రంగా గాయ పడ్డారు.

ఈ ఘటన పై పోలీసులు విచారణ చేపడతున్నారు. అమరావతి ప్రాంతం లో ఏదో జరిగి పోతుందనే తప్పుడు సంకేతాలను పంపించే ఉద్దేశం తోనే, పథకం ప్రకారం మీడియా ప్రతినిధుల పైన దాడి జరిగిందని కొందరు ఆరోపిస్తున్నారు. కాగా, టీడీపీ నాయకులే అమరావతి లో రైతుల తో ఉద్యమం చేపిస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు మీడియా ప్రతి నిధుల పైన దాడిని జర్నలిస్టు సంఘాలు ఖండిస్తున్నాయి. గతంలో తాము చాలా సార్లు ఈ ప్రాంతం లో వార్తలు కవర్‌ చేశామని, కానీ రైతులు ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదని పలువురు జర్నలిస్టులు చెప్తున్నారు.