Begin typing your search above and press return to search.
మాజీ సీఎం సోదరుడి వాహనంపై రాళ్లదాడి..రాస్తారోకో
By: Tupaki Desk | 11 Dec 2020 12:59 PM GMTఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతలు క్షీణించాయని, టీడీపీ నేతలపై దాడులు పెరిగాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో లా అండ్ ఆర్డర్ ను గాడిలో పెట్టాలని డీజీపీ సవాంగ్ కు టీడీపీ అధినేత చంద్రబాబు పలుమార్లు లేఖలు కూడా రాశారు. ఎన్ని లేఖలు రాసినా...ఏపీలో కక్ష సాధింపు రాజకీయాలు పెరిగిపోయాయని చంద్రబాబు, టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్తూరులో టీడీపీ జాతీయ కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డిపై దాడి జరిగిన ఘటన రాజకీయంగా కలకలం రేపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడైన కిషోర్ కుమార్ రెడ్డి వాహనంపై కొందరు వ్యక్తులు రాళ్లదాడి చేశారు. మదనపల్లె మండలం అంగళ్లు వద్ద జరిగిన ఈ ఘటనలో కిషోర్ కుమార్, టీడీపీ నేత మధుబాబుకి తీవ్ర గాయాలవడం జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది.
అంగళ్లులో టీడీపీ కార్యకర్తను పరామర్శించేందుకు వెళుతున్న కిషోర్ కుమార్ రెడ్డి, టీడీపీ నేతల వాహనాలపై కొందరు దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. రాళ్ల దాడి ధాటికి వారి కార్ల అద్దాలు పగిలిపోయి లోపలున్న వారికి గాయాలయ్యాయి. దీంతో, ఆగ్రహానికి గురైన కిషోర్ కుమార్ రెడ్డి, ఇతర టీడీపీ నేతలు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. తమపై వైసీపీ మద్దతుదారులే దాడికి పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, టీడీపీలో వర్గపోరు ఉందని, ఆ పార్టీకి చెందిన మరో వర్గం నేతలే ఈ దాడికి పాల్పడి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే అనుమానం ఉన్న కొందరు టీడీపీ మద్దతుదారులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ఖండించారు. కిషోర్ కుమార్ రెడ్డిని ఫోన్ లో పరామర్శించిన లోకేష్....ఇది వైసీపీ నేతల దాడేనని ఆరోపించారు. వైసీపీ దాడులకు భయపడబోమని, ప్రజా సమస్యలపై టీడీపీ పోరాటం కొనసాగుతుందని అన్నారు. ఈ తరహా ఘటనలు మరోసారి జరగకుండా ఏపీ డీజీపీ చూడాలన్నారు.