Begin typing your search above and press return to search.
కడపలో మొదలైన కత్తుల వేట...వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిని నరికిన ప్రత్యర్థులు !
By: Tupaki Desk | 11 March 2020 12:09 PMఏపీలో స్థానిక పోరు మొదలైంది. అన్ని పార్టీలు కూడా విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతుండటంతో సర్వత్రా ఉత్కంఠత నెలకొన్నది. నామినేషన్లు వేసేందుకు వెళ్లిన అభ్యర్థులపై చాలా ప్రాంతాలలో ప్రత్యర్థులు దాడులకు దిగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా, కడప జిల్లాలో కత్తులతో దాడులకు దిగడం కలకలం రేపుతోంది. కడప జిల్లా మైదుకూరు మండలం తిప్పిరెడ్డిపల్లెలో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిపై ప్రత్యర్థులు కత్తులతో ప్రత్యర్థులు దాడికి దిగారు.
ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరప్రసాద్ పై ప్రత్యర్థులు కత్తులు, కర్రలతో మంగళవారం రాత్రి దాడికి దిగారు. వరప్రసాద్ పని మీద తిప్పిరెడ్డిపల్లె వెళ్తుండగా ఈ దాడి జరిగింది. ఈ దాడి లో వరప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడు. దీనితో వెంటనే ఆయన్ని ప్రొద్దుటూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వరప్రసాద్ పరిస్థితి కొంత విషమంగానే ఉంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అయితే, ఎన్నికల కడప జిల్లాలో హింస చెలరేగడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరోవైపు గుంటూరు జిల్లాలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిపై ప్రత్యర్థులు దాడికి దిగారు.
మాచవరం మండలం పిన్నెల్లిలో వైసీపీ శ్రేణులు నామినేషన్ వేయడానికి వెళుతున్న టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిపై దాడి చేశాయి. కుర్చీలతో ఇరు పార్టీల నేతలు కొట్టుకున్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, ఇరువర్గాలను ఘటన స్థలం నుండి పంపించివేయడంతో వివాదం సద్దుమణిగింది. చిత్తూరు జిల్లాలో కూడా నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లిన బీజేపీ నేతను వైసీపీ నేతలు అడ్డుకున్నారని సమాచారం. మొత్తంగా స్థానిక పోరు ఇంకెన్ని వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తుందో మరి.