Begin typing your search above and press return to search.
వ్యాక్సిన్ వద్దంటూ సిబ్బందిపై కర్రలు, రాళ్లతో దాడి .. నదిలోకి దూకిన గ్రామస్థులు !
By: Tupaki Desk | 25 May 2021 10:36 AM GMTమనదేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ మహమ్మారికి అడ్డుకట్టవేయాలంటే వ్యాక్సినేషన్, నిబంధనలు పాటించడం తప్పనిసరి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. అయితే ఓ గ్రామస్థులు మాత్రం కరోనా వ్యాక్సిన్ వేస్తారనే భయంతో పారిపోయారు. ఏకంగా వ్యాక్సిన్ వద్దంటూ ఏకంగా నదినే దాటారు. ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. దేశంలో వ్యాక్సిన్ కోసం చాలా మంది ఎదురుచూస్తుంటే , మరోవైపు వ్యాక్సిన్ వేసేందుకు గ్రామానికి వచ్చిన అధికారుల బృందాన్ని చూసి ఆ గ్రామస్థులు నదిలోకి దూకి పారిపోయారు.
బారాబంకీలోని శిసోడా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా వైద్యుల బృందం శిసోడా గ్రామానికి వెళ్లారు. అయితే, అక్కడి ప్రజలు తమకు వ్యాక్సిన్ వద్దని వారించారు. వారికి వ్యాక్సిన్ వల్ల కలిగే ప్రయోజనాలు గురించి వివరిస్తున్న సమయంలో కొందరు నదిలోకి దూకి.. తమకు టీకా వద్దంటే వద్దని చెప్పారు. దీంతో వైద్యుల బృందం వెనుతిరిగింది. అయితే, ఆ గ్రామస్థులు ఇలా ఆందోళన చెందడానికి మరో కారణం కూడా ఉంది. వ్యాక్సిన్ వల్ల సెక్స్ సామర్థ్యం సన్నిగిల్లుతుందని, పురుషులు నపుంసకులు అవుతారనే తప్పుడు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ ఊరిలోని పురుషులంతా టీకా తీసుకోడానికి ముందుకు రావడం లేదు. రాంనగర్ తహసీల్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ రాజీవ్ కుమార్ సుక్లా మాట్లాడుతూ.. ‘‘ఆ గ్రామంలో సుమారు 1500 మంది నివసిస్తున్నారు. వారిలో సుమారు 200 మంది గ్రామం నుంచి పారిపోయి నదీ తీరంలో దాక్కున్నారు. వైద్యుల బృందం అక్కడికి చేరగానే వారు నదిలోకి దూకారు’’ అని తెలిపారు. అలాగే టీకాలు తీసుకున్న తర్వాత కూడా మనుషులు చనిపోతూన్నారని , దానితో టీకా తీసుకుంటే ఏం ప్రయోజన అని ప్రశ్నిస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే .. మధ్యప్రదేశ్ లో ప్రజలు వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించేందుకు వచ్చిన వైద్య అధికారులపై గ్రామస్తులు దాడి చేశారు. ఉజ్జయిని జిల్లా మెయిల్‌ఖేడీ గ్రామంలో వ్యాక్సిన్ పై గ్రామస్తులకు సోమవారం అవగాహన కల్పించేందుకు అధికారులు వచ్చారు. గ్రామంలోకి అధికారులు వస్తున్నారని తెలుసుకున్న గ్రామస్తులు అడ్డుకున్నారు. వ్యాక్సిన్ వేసుకుంటే అనారోగ్యం వస్తుందనే భావనలో గ్రామస్తులు ఉన్నారు. దీంతో వ్యాక్సిన్ పై అవగాహన కల్పించేందుకు వచ్చిన అధికారులపై రాళ్లు, కర్రలు పట్టుకుని ఎదురుతిరిగారు.ప్రాణభయంతో వైద్య సిబ్బంది తలో దిక్కు పారిపోయారు. గ్రామస్తుల దాడిలో ఓ పంచాయతీ అధికారిణి తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తులు బెదిరించి గ్రామం నుంచి వారిని వెళ్లగొట్టారు. ఈ ఘటనతో పోలీసులు గ్రామంలోకి ప్రవేశించారు. మొత్తంగా దేశంలో వ్యాక్సిన్ దొరకక కొందరు చనిపోతుంటే , వ్యాక్సిన్ వద్దంటూ ఈ తరహా ఘటనలకు పాల్పడుతున్నారు.