Begin typing your search above and press return to search.
టీడీపీ ఆఫీసుపై దాడి.. కొత్త సమీకరణాలకు తెర తీస్తుందా?
By: Tupaki Desk | 20 Oct 2021 8:30 AM GMTఏపీలో రాజకీయం అంతకంతకూ వేడెక్కటం తెలిసిందే. వేడి ఒక స్థాయి దాటిన తర్వాత బరస్ట్ కావటం ఖాయం. తాజాగా అలాంటి పరిస్థితే ఏపీలో నెలకొంది. అధికార వైసీపీ.. వర్సెస్ విపక్ష టీడీపీ మధ్య నడుస్తున్న రాజకీయ రగడకు తాజా డ్రగ్స్ వివాదం ఆజ్యం పోసింది. ఒకరిపై ఒకరు బలమైన ఆరోపణలు చేసుకుంటున్న వేళ.. టీడీపీ నేత పట్టాభి చేసిన ఘాటు వ్యాఖ్యలకు ప్రతిగా.. ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో ఉన్న టీడీపీ కార్యాలయాలపై దాడి జరగటం తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే ఏపీ డీజీపీ ఆఫీసుకు కేవలం వంద మీటర్ల దూరంలో ఉన్న పార్టీ ప్రధాన కార్యాలయం మీదకు అల్లరిమూకలు భారీగా చేరుకొని దాడి చేయటం.. ఆస్తులు విధ్వంసం జోరుగా సాగటం తెలిసిందే.
దీనికి సంబంధించిన వీడియో క్లిప్పులు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఉదంతంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. టీడీపీ కార్యాలయం.. నేతల ఇళ్లపై దాడుల్ని ఆయన ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు ఎవరికీ క్షేమం కాదన్నారు. రాజకీయ పార్టీలుగా ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని.. ఇలాంటి దాడులు ఆరాచకానికి.. దౌర్జన్యానికి దారి తీస్తాయన్నారు.
ఒకే సమయంలో వివిధ ప్రాంతాల్లో దాడులు జరగటం అంటే.. అవన్నీ ఉద్దేశపూర్వకంగా చేసినవే అవుతాయన్న మాటను వినిపించారు. వైసీపీ వర్గం వారే ఈ దాడులు చేయించారన్నారు. నిందితులు ఎంతటి వారైనా అరెస్టు చేసి.. కఠినంగా శిక్షించాలన్నారు. పవన్ నుంచి వచ్చిన ఈ స్పందన రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీలో మరింత దగ్గర కావటానికి సాయం చేస్తుందన్న మాట వినిపిస్తోంది. తాజా ఎపిసోడ్ లో తమపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన పవన్ తీరు.. టీడీపీ వర్గాలకు దగ్గర చేయటంతోపాటు.. రానున్న రోజుల్లో రెండు పార్టీల మధ్య పొత్తుకు బాటలు వేసేలా చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నిజానికి గడిచిన కొద్దికాలంగా వైసీపీకి చెక్ చెప్పాలంటే.. టీడీపీ - జనసేనలు కలవాలని.. ఇరు పార్టీల పొత్తుతో వైసీపీకి దెబ్బ పడటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఈ రెండు పార్టీలు ఏ ఎజెండా మీద ఒక వేదిక మీదకు వస్తాయన్నది ప్రశ్నగా మారింది. కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారన్నట్లు.. తాజాగా టీడీపీ నేతల ఇళ్ల మీదా..పార్టీ ఆఫీసుల మీద వైసీపీకి చెందిన పలువురు దాడులు చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో రెండు పార్టీలు ఏకమై.. అధికార పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పేందుకు సాయం చేస్తుందన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పునకు తాజా పరిణామాలు కారణమవుతాయని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.