Begin typing your search above and press return to search.
తీన్మార్ మల్లన్న పై దాడి.. ఈ లొల్లికి అసలు కారణమేంటి?
By: Tupaki Desk | 25 Dec 2021 6:34 AM GMTతెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. తెలంగాణ అధికారపక్షం.. విపక్ష బీజేపీ మధ్య నువ్వా నేనా? అన్నట్లుగా సాగుతున్నరాజకీయ పోరు ఇప్పుడు భౌతిక దాడుల వరకు వెళ్లిందా? అంటే.. అవునన్న మాట వినిపిస్తోంది. పదునైన వ్యాఖ్యలు.. ఘాటు విమర్శలు.. దిమ్మ తిరిగే ఆరోపణలతో తరచూ సంచలనంగా వ్యవహరించే తీన్మార్ మల్లన్నపై దాడి జరిగింది. ఇటీవలే ఆయన బీజేపీలో చేరిన వైనం తెలిసిందే. అయితే.. ఈ దాడికి కారణం.. తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూన్యూస్ మీడియా తన ట్విట్టర్ ఖాతాలో నిర్వహించిన పోల్ అన్న మాట వినిపిస్తోంది. అయితే.. తమ ట్విటర్ ఖాతా హ్యాక్ అయ్యిందని.. తాము అలాంటి తప్పు చేయలేదని మల్లన్న చెబుతున్నారు. మరోవైపు ట్విటర్ లో తన కుమారుడ్ని బాడీ షేమింగ్ చేస్తూ పోల్ నిర్వహిస్తారా? ఇదేం సంస్కారం అంటూ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు.
తాను తప్పు చేయలేదని.. ట్విటర్ లో పెట్టిన పోల్ తో తనకు సంబంధం లేదని.. ఖాతా హ్యాక్ చేశారని మల్లన్న వాపోతున్నాడు. శుక్రవారం రాత్రి వేళలో తీన్మార్ మల్లన్న ఆఫీసులోకి ప్రవేశించిన కొందరు మల్లన్నతో వాగ్వాదానికి దిగటంతో పాటు.. అతడిపై దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా ఆపీసులోని సామాన్లను ధ్వంసం చేశారు. ఈ రచ్చంతా చేసింది టీఆర్ఎస్ కు చెందిన వారేనని తీన్మార్ మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేస్తున్నారు.
అసలీ వివాదానికి కారణం.. క్యూ న్యూస్ సంస్థ ట్విటర్ లో నిర్వహించిన పోలేనని చెప్పక తప్పదు. అయితే.. తీన్మార్ మల్లన్న అండ్ తమ ట్విటర్ ఖాతా హ్యాక్ అయ్యిందని.. ఇదంతా మంత్రి కేటీఆర్ ఆడించిన నాటకంగా మండిపడుతున్నారు. క్యూస్ సంస్థకు చెందిన ట్విటర్ ఖాతాలో.. డెవలప్ మెంట్ ఎక్కడ జరిగింది? భద్రాచలం గుడిలోనా? హిమాన్షు శరీరంలోనా? అనే వివాదాస్పద పోల్ కారణం. అయితే.. ఈ పోల్ ట్వీట్ తాను పెట్టలేదని.. తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని.. ఇలాంటి ట్విట్లు తాను చేయనని తీన్మార్ మల్లన్న నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. తమ ట్విటర్ ఖాతా హ్యాక్ చేసి.. కావాలనే ఇలాంటి పనులు చేస్తున్నారని చెబుతున్నారు.
హిమాన్షుపై మీద ట్విటర్ పోల్ చేపట్టటంపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదేనా మీ సంస్కారం? అంటూ బీజేపీ నేతలపై నిప్పులు చెరుగుతున్నారు. తాము ఎవరినీ వ్యక్తిగత విమర్శలకు దిగటం లేదని.. అలాంటప్పుడు కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగి ఇబ్బందులకు గురి చేయటమేమిటని ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. బీజేపీ నేతలు తన కుమారుడ్నిరాజకీయాల్లోకి లాగటం ఏమిటని ఆయన మండిపడ్డారు.
ప్రధాని మోడీని.. కేంద్ర మంత్రి అమిత్ షా కుటుంబ సభ్యుల్ని ఉద్దేశించి తామూ ఇదే తరహాలో స్పందిస్తామని ఎందుకు అనుకోరు? అంటూ మండిపడ్డ కేటీఆర్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఈ పోల్ పై కంప్లైంట్ చేశారు. ఈ పోల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మల్లన్న కార్యాలయం లోపలకు వచ్చిన పలువురు.. ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. భౌతిక దాడులకు తెగపడ్డారు. మల్లన్న ఆఫీసులోని సామాగ్రిని ధ్వంసం చేశారు. ఇంతకూ మల్లన్న ట్విటర్ ఖాతా హ్యాక్ అయ్యిందా? లేదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఒకవేళ అభ్యంతరకర పోల్ తో తనకు సంబంధం లేకుండా జరిగి ఉంటే.. వెంటనే ఒక ప్రెస్ నోట్.. ఆ వెంటనే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి ఉంటే సరిపోయేది. మరి.. ఆ పనులు తీన్మార్ మల్లన్న చేశారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. ఏమైనా.. తాజా ఎపిసోడ్ తో తెలంగాణ లో రాజకీయం పూర్తిగా వేడెక్కిపోయిందన్న వైనాన్ని స్పష్టం చేస్తుందని చెప్పక తప్పదు.