Begin typing your search above and press return to search.
జీతాలు ఇవ్వని ఐఫోన్ తయారీ కంపెనీ.. ఉద్యోగుల దాడితో నష్టం ఎంతంటే?
By: Tupaki Desk | 14 Dec 2020 12:52 PM GMTఐఫోన్ కావొచ్చు.. మరే ప్రముఖ కంపెనీ అయినా కావొచ్చు. తమ ఉత్పత్తుల్ని వారు మాత్రమే తయారు చేయరు. పలు కంపెనీలకు కాంట్రాక్టు ఇస్తారు. తమ ఉత్పత్తుల్ని వారు తయారు చేసి ఇస్తే.. సదరు కంపెనీలు అమ్ముకుంటాయి. ఇదే రీతిలో ఐఫోన్లను తయారు చేసే కంపెనీల్లో విస్ట్రాన్ ఒకటి. తైవాన్ కు చెందిన ఈ కంపెనీకి కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఒక భారీ ప్లాంట్ ఉంది. బెంగళూరుకు అరవై కిలోమీటర్ల దూరంలో ఉండే నర్సాపూర్ లో ఈ ఫ్లాంట్ ఉంది. ఇక్కడే తైవాన్ టెక్ దిగ్గజం విస్ట్రాన్ కార్పొరేషన్ ఐఫోన్లను ఉత్పత్తి చేస్తుంది. దేశంలోని తన తొలి ప్లాంట్ ను ఇక్కడ ఏర్పాటు చేశారు.
అయితే.. కంపెనీకి ఉద్యోగులకు మధ్య జీతాల వివాదం గడిచిన మూడు నెలలుగా నడుస్తోంది. దీంతో విసిగిపోయిన ఉద్యోగులు.. సహనం నశించి.. ఈ నెల 12న సంస్థపై దాడి చేశారు. ఈ సందర్భంగా ఫర్నీచర్ ను ధ్వంసం చేయటమేకాదు.. వాహనాలకు నిప్పు అంటించారు. అసెంబ్లింగ్ పరికరాలు.. బయోటెక్ డివైజ్ లు ఇలా వేటిని లెక్క చేయకుండా ధ్వంసం చేశారు. దీంతో.. ఈ వ్యవహారం పెను సంచలనంగా మారింది.
ఈ ఉదంతంలో వంద మంది వరకు పాల్గొన్నట్లు చెబుతున్నారు. ఈ విధ్వంసానికి పాల్పడినట్లుగా చెబుతున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడికి సంబంధించిన క్లిప్ లు సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నాయి. విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే..ఈ దాడి కారణంగా తొలుత రూ.40 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లుగా అంచనా వేశారు. అయితే.. తీవ్రత ఎక్కువగా ఉందని.. 700 కంప్యూటర్లతో పాటు పెద్ద ఎత్తున సామాగ్రి దెబ్బ తిన్నట్లుగా చెబుతున్నారు. దాదాపు రూ.100కోట్ల మేర ఆస్తినష్టం వాటిల్లినట్లుగా ప్రచారం జరుగుతుందే.. సదరు కంపెనీ మాత్రం ఏకంగా రూ.440 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లుగా పేర్కొంది.
ఈ దాడిని కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ యూనిట్ కోసం 8900 మందిని నియమించుకునే విషయానికి సంబంధించి.. విస్ట్రాన్ కంపెనీకి.. కాంట్రాక్ట్ ఉద్యోగులకు మధ్య వివాదం నెలకొందని.. అది కాస్తా తాజాగా హింసగా మారినట్లు చెబుతున్నారు. కంపెనీ తీరుపై విసిగిపోయిన ఉద్యోగులు ఈ తీరుగా స్పందించి ఉంటారన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం పెను సంచలనంగా మారిందని చెప్పక తప్పదు.