Begin typing your search above and press return to search.

నేటి నుంచే పార్ల‌మెంటు..దాడులే మొద‌టి ఎజెండా

By:  Tupaki Desk   |   9 March 2017 6:05 AM GMT
నేటి నుంచే పార్ల‌మెంటు..దాడులే మొద‌టి ఎజెండా
X
కేంద్ర‌ బడ్జెట్‌ పార్ల‌మెంటు బ‌డ్జెట్‌ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌ 12 వరకు జరిగే ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ఇందులో కీల‌క అంశంగా అమెరికాలో భార‌తీయుల‌పై జ‌రుగుతున్న దాడుల అంశం చ‌ర్చ‌కు రానున్న‌ట్లు తెలుస్తోంది. పార్ల‌మెంట్‌ లోఈ అంశంపై మాట్లాడేందుకు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ పార్టీ స‌మాయ‌త్తంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆందోళ‌న‌క‌రంగా మారిన దాడుల అంశాన్ని లేవ‌నెత్తాల‌ని భావిస్తున్న‌ట్లు కాంగ్రెస్ శాస‌న‌స‌భా ప‌క్ష నేత‌ మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే తెలిపారు. అమెరికాకు వెళ్లి ప్ర‌సంగించి వ‌చ్చిన మోడీ అక్క‌డ మ‌న వారి ఆవేద‌న‌ను ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆయ‌న నిల‌దీశారు. ఇతర ప్ర‌తిప‌క్షాల‌ను సైతం ఈ విష‌యంలో క‌లుపుకొని పోతామ‌న్నారు.

కాగా, ఇప్పటికే అధికార, ప్రతిపక్షాలు వ్యూహాలు, ప్రతివ్యూహాలతో సిద్ధమయ్యాయి. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలకు పదును పెడితే... వారిని అడ్డుకునేందుకు అధికార పక్షం సమాలోచనలు చేస్తున్నది. తొలి విడత సమావేశాలు కేవలం పది రోజులు మాత్రమే జరిగాయి. ఈ సమావేశాల్లో మూడు బిల్లులపైన ఆర్డినెన్స్‌ తీసుకొచ్చారు. మొత్తం 34 బిల్లులను ఆమోదించేందుకు ప్రభుత్వం యోచించినా, కేవలం రెండు బిల్లులు మాత్రమే ఆమోదం పొందాయి. ఇందులో ఐదు బిల్లులు కొత్తగా ప్రవేశపెట్టారు. రెండో విడత సమావేశాలు 35 రోజుల పాటు జరగనున్నాయి. ఇందులో 23 రోజులు మాత్రమే సభా నిర్వహణ జరుగుతుంది. 12 రోజులు పాటు పార్లమెంట్‌కు విశ్రాంతి ఉంటుంది. ఈ సమావేశాల వరకు పార్లమెంట్‌ ఉభయ సభల్లో 70 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అందులో రాజ్యసభలో 51, లోక్‌సభలో19 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని బిల్లులను ఆమోదానికి ఎజెండాలో పెడుతుందో నేడు స్ప‌ష్ట‌త వ‌స్తుంది.

మహిళ సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మహిళ రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. రాజ్యసభలో ఆమోదం పొంది లోక్‌సభలో ఆమోదం పొందాల్సిన కీలకమైన మహిళ రిజర్వేషన్‌ బిల్లు ఎజెండాలో పెట్టకపోవచ్చు. ఎందుకంటే లోక్‌ సభ వెబ్‌ సైట్‌ లో పెండింగ్‌ బిల్లుల జాబితాలో ఆ బిల్లును పొందపరచలేదు. దేశంలో నెలకొన్న అంశాలు, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/