Begin typing your search above and press return to search.

వైరల్ వీడియో: భారతీయుల అరెస్ట్ కు యత్నం.. అడ్డుకున్న బ్రిటన్ ప్రజలు

By:  Tupaki Desk   |   15 May 2021 9:02 AM IST
వైరల్ వీడియో: భారతీయుల అరెస్ట్ కు యత్నం.. అడ్డుకున్న బ్రిటన్ ప్రజలు
X
భారతీయుల అరెస్ట్ ను బ్రిటన్ ప్రజలంతా కలిసి అడ్డుకున్న అరుదైన దృశ్యం తాజాగా చోటుచేసుకుంది. ఇద్దరు భారతీయులకు పాకిస్తాన్ కు చెందిన లాయర్ సహా వేలాది మంది అండగా నిలిచారు. అరెస్ట్ చేయవద్దంటూ నినదించారు. దీంతో అధికారులు, పోలీసులు వెనక్కి తగ్గారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సుమిత్ సహదేవ్ (చెఫ్), లఖ్వీర్ సింగ్ (మెకానిక్) ఇద్దరూ దాదాపు 10 ఏళ్లుగా యూకేలో నివసిస్తున్నారు.వీరిద్దరూ అక్రమంగా నివసిస్తున్నారనే ఆరోపణలతో యూకే ఇమ్మిగ్రేషన్ అధికారులు, స్కాట్లాండ్ పోలీసులు గురువారం గ్లాస్కో లోని పోలోక్ షీల్డ్స్ ప్రాంతానికి చేరుకొని వీరిని అరెస్ట్ చేశారు. అనంతరం పోలీస్ వ్యాన్ లో ఎక్కించారు.

అయితే తమకు 10ఏళ్లుగా తెలిసిన సుమిత్, లఖ్వీర్ సింగ్ ల అరెస్ట్ ను నిరసిస్తూ స్థానిక ప్రజలు వేలాది మంది రోడ్లపైకి వచ్చారు. పోలీస్ వ్యాన్ ను అడ్డుకున్నారు. పాకిస్తాన్ కు చెందిన లాయర్ అమీర్ అన్వర్ సైతం భారతీయుల అరెస్ట్ ను వ్యతిరేకించారు. దాదాపు 8 గంటల పాటు ఆందోళనలు కొనసాగిన నేపథ్యంలోయూకే ఇమ్మిగ్రేషన్ అధికారులు, పోలీసులు వెనక్కి తగ్గారు. సుమిత్, లఖ్వీర్ లను వదిలేశారు.

తమకు అండగా నిలిచిన ప్రజలకు వారిద్దరూ ధన్యవాదాలు తెలిపారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. బ్రిటన్ లోని వలసదారులను అక్కడి ప్రజలు ఎలా ఓన్ చేసుకుంది తేటతెల్లమైంది.

వీడియో

https://twitter.com/ClaudiaWebbe/status/1393106190016651267?s=20