Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబుకు షాక్‌.. క‌బ్జారాయుళ్ల హ‌ల్చ‌ల్‌.. కుప్పంలో భూ క‌బ్జాకు య‌త్నం

By:  Tupaki Desk   |   18 Feb 2022 6:34 AM GMT
చంద్ర‌బాబుకు షాక్‌.. క‌బ్జారాయుళ్ల హ‌ల్చ‌ల్‌.. కుప్పంలో భూ క‌బ్జాకు య‌త్నం
X
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు బిగ్ షాక్‌. ఆయ‌న‌ స్వగ్రామం, కుప్పంలోని నారావారిపల్లెలో చంద్రబాబునాయుడుకు చెందిన భూమిని అదే గ్రామానికి చెందిన మరొకరు కబ్జా చేశారు. 1989లో సర్వే నంబర్ 222/5లో 87 సెంట్లు రిజిస్టర్ భూమిని నారా చంద్రబాబు నాయుడు తండ్రి నారా ఖర్జూర నాయుడు కొనుగోలు చేశారు.

ఆయన తదనంతరం ఆ భూమిలో కొంత భాగాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వితరణ చేశారు. మిగిలిన 38 సెంట్ల భూమి వారి పేరు మీద ఆన్లైన్లో నమోదు చేసుకోకపోవడంతో.. అదే అదనుగా భావించిన రాజేంద్ర నాయుడు.. భూమిని కబ్జా చేసేందుకు రాతి కుసాలు నాటాడు.

ఈ భూమికి సంబంధించిన పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా ఉండడంతో నారా రామ్మూర్తి నాయుడు భార్య ఇందిరమ్మ చంద్రగిరి ఎమ్మార్వోకి ఫిర్యాదు చేశారు. ఈ స్థలంలో ప్రతి సంవత్సరం నారా భువనేశ్వరి సంక్రాంతి పర్వదినాన రంగవల్లులు, క్రీడా పోటీలు ఇక్కడ నిర్వహించేవారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సొంత ఊరిలోనే బాబుకు చెందిన భూమిని కబ్జాచేసేందుకు కబ్జాదారులు యత్నించ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఈ భూమిని ఆక్రమించుకోవడంతో పాటు ఫెన్సింగ్ వేసేందుకు కబ్జాదారులు ప్రయత్నించ‌డం.. దీనికి కొంద‌రుఅధికారులు కూడా స‌హ‌క‌రించ‌డం వివాదంగా మారింది.

1989లో 87 సెంట్లలో చంద్రబాబు తండ్రి ఖర్జూరనాయుడు 87 సెంట్ల భూమిని కొనుగోలు చేశారు. కొంతకాలం తర్వాత ఆస్పత్రి, కళ్యాణమండపానికి కొంతభూమిని చంద్రబాబు వితరణగా ఇచ్చారు. ఇప్పుడు మిగిలిని ఈ భూమిపై కబ్జాదారుల కన్ను పడింది. చంద్రబాబుకు చెందిన 38సెంట్ల భూమిలో కబ్జాదారులు ఫెన్సింగ్ వేస్తున్నారు. వెంటనే అక్కడకు చేరుకున్న గ్రామస్థులు కబ్జాను అడ్డుకున్నారు. అయితే ఈ భూమి తమదే అని, తమకే హక్కులు ఉన్నాయని కబ్జాదారులు రాళ్లు నాటే ప్రయత్నం చేస్తున్నారు.

ఇంత జరుగుతున్నప్పటికీ పోలీసులు స్పందించ‌లేదు. ఘటనాస్థలానికి చేరుకోని పరిస్థితి నెలకొంది. చంద్రబాబు కుటుంబీకులు కూడా ఎవరూ ఇంతవరకు రాకపోవడంతో అక్కడి ప్రజలే కబ్జాను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏకంగా చంద్రబాబుకు చెందిన భూమినే కబ్జా చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది.