Begin typing your search above and press return to search.

పాలిస్తున్న తల్లిపై అత్యాచార యత్నం.. బిడ్డను పక్కన పడేసి మరీ..

By:  Tupaki Desk   |   29 Aug 2020 6:30 AM GMT
పాలిస్తున్న తల్లిపై అత్యాచార యత్నం.. బిడ్డను పక్కన పడేసి మరీ..
X
వాడు మనిషి కాదు.. మానవ మృగంగా చెప్పక తప్పదు. ఏడాది బిడ్డకు చనుబాలు ఇస్తున్న మహిళపై కామంతో రగిలిపోతూ దారుణంగా వ్యవహరించిన వైనం కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు మహానగరంలో చోటు చేసుకుంది. పాలు తాగుతున్న పసి పిల్లాడ్ని పక్కకు నెట్టేసి మరీ అత్యాచార యత్నానికి పాల్పడిన ఈ దుర్మార్గ ఉదంతంలో.. నిందితుడు సతీమణి సహకరించిన వైనం చూస్తే.. షాక్ తినాల్సిందే.

బెంగళూరులోని సిద్దపుర ప్రాంతంలోని హోంబిగౌడనగరికి చెందిన 24 ఏళ్ల మహిళ పై అదే ప్రాంతానికి చెందిన కుమార్ కన్నేశాడు. తాజాగా తన ఏడాది బిడ్డకు పాలిస్తున్న వేళ.. ఆమెను చూసి కామంతో రగిలిపోయాడు. ఇంట్లో ఎవరూ లేకపోవటాన్ని గమనించిన అతగాడు.. పాలు తాగుతున్న బిడ్డను పక్కకు లాగి పడేయటమే కాదు.. ఆమె బట్టలు చించేసి అత్యాచారయత్నానికి ప్రయత్నిస్తూ ఆరాచకాన్ని సృష్టించాడు.

దీంతో భయాందోళనలకు గురైన సదరు మహిళ కేకలు.. అరుపులకు అక్కడకు చేరుకున్న నిందితుడి భార్య.. భర్తను వెనకేసుకు రావటమే కాదు..అతడ్ని అక్కడి నుంచి తప్పించేలా చేయటం గమనార్హం. బాధిత మహిళను దారుణంగా తిటేస్తూ.. భర్తను ఇంటి నుంచి బయటకు దాటించేసింది. జరిగిన దారుణంపై బాధిత మహిళ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది.

దీంతో.. నిందితుడి పై అత్యాచారం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. తన భర్తను అదుపులోకి తీసుకున్న పోలీస్ స్టేషన్ కు వెళ్లిన నిందితుడి భార్య.. హడావుడి చేసింది. బీపీ ఉన్నట్లు నటిస్తూ.. తన భర్తపై తప్పుగా కేసు పెట్టారంటూ నిద్రమాత్రలు మింగి.. ఆత్మహత్యయత్నానికి తెర తీసింది. దీంతో.. ఆమెను ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ప్రస్తుతానికి నిందితుడి భార్యకు ఎలాంటి ప్రాణాపాయం లేదని.. ఆమె ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. నిందితుడ్ని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇదంతా విన్నప్పుడు నిందితుడ్నిఏం చేసినా ఫర్లేదన్న బావనతో పాటు.. అతడ్ని అదే పనిగా వెనకేసుకొస్తున్న భార్యపైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.