Begin typing your search above and press return to search.

గుప్త నిధుల కోసం ఐదుగురు చిన్నారుల బలికి యత్నం.. చివర్లో!

By:  Tupaki Desk   |   16 Nov 2020 8:30 AM GMT
గుప్త నిధుల కోసం ఐదుగురు చిన్నారుల బలికి యత్నం.. చివర్లో!
X
మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అంటే నమ్మే రోజుల్లోనే ఇంకా కొంతమంది ఉన్నారు. సాంకేతికంగా , ఆధునికంగా ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ , ఇంకా కొన్ని రాష్ట్రాల్లో మూఢ నమ్మకాలు పోలేదు. గుప్త నిధుల కోసం నరబలులు , పిల్లలు పుడతారని చేతబడులు చేస్తూనే ఉన్నారు. మూఢ నమ్మకాలను విశ్వసిస్తున్న వారు జంతు బలులు, నర బలులు కొనసాగిస్తున్న కథనాలు నిత్యం వింటున్నాం . తాజాగా అస్సాంలో నరబలుల యత్నం జరిగింది. అస్సాంలో గుప్త నిధుల కోసం ఐదుగురు పిల్లలని బలి ఇవ్వటానికి ప్రయత్నం జరిగింది .ఐదుగురు చిన్నారులను బలి ఇచ్చేందుకు సిద్ధం కాగా, స్థానికులు అప్రమత్తమై పోలీసులకు పట్టించారు. స్థానికుల చొరవతో ఐదుగురు చిన్నారుల ప్రాణాలు దక్కాయి.

అసోంలోని శివసాగర్ జిల్లాలోని శివసాగర్ జిల్లాకు చెందిన జమియుల్ హుస్సేన్, షరీఫుల్ హుస్సేన్ లు అమావాస్య నాడు కాళీ మాతకు చిన్నారులను బలిస్తే గుప్తనిధులు దొరుకుతాయని మంత్రగాడి మాటలు విని తమ ఇంటి వెనకాల ఉన్న మామిడి చెట్టుకు చిన్నారులను కట్టేసి బలి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కాళీమాతకు చిన్నారులను బలిస్తే గుప్తనిధులు దొరకడంతో పాటు కుటుంబంలోని అన్ని సమస్యలు తీరుతాయని మాంత్రికుడు వారికి చెప్పడంతో అది నమ్మి పిల్లలను బలి ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు.

ఈ విషయం తెలిసిన పోలీసులు ఐదుగురు మైనర్ బాలురను బలి ఇవ్వకుండా రక్షించారు. గుప్త నిధి వస్తుందనే ఆశతో మంత్రగాడి సలహా మేరకు మైనర్ బాలురలో ఒకరి తండ్రి తన సొంత కొడుకులను, తన సోదరుడి ముగ్గురు కొడుకులను బలి ఇవ్వాలనుకున్న ఘటనపై ఇంకా దర్యాప్తు సాగుతుందని అంటున్నారు పోలీసులు .

అయితే , అంతకంటే ముందు మంత్రగాడి దగ్గరకు వెళ్లి వచ్చారని చుట్టుపక్కల వారు గమనించి, వీరి కదలికలపై నిఘా పెంచారు. శనివారం అర్థరాత్రి చిన్నారుల అరుపులు వినడంతో మేల్కొన్న స్థానికులు బలి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న వారిని రక్షించారు. చిన్నారుల తల్లిదండ్రులను పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు తల్లిదండ్రులతో పాటు మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు. బలి ఇచ్చేందుకు ఐదుగురు చిన్నారులను ఒక గదిలో బంధించామని, మంత్రగాడు చెప్పడంతో ఈ పని చేశామని తల్లిదండ్రులు పోలీసుల ముందు నేరం అంగీకరించారు.