Begin typing your search above and press return to search.
బాల్ ఠాక్రే హత్యకు రెండు సార్లు ట్రై చేశాడట
By: Tupaki Desk | 24 March 2016 7:35 AM GMT26/11 ఉగ్రదాడుల కేసులో ముఖ్య నిందితుడు డేవిడ్ హ్యాడ్లీ సంచలన విషయాన్ని వెల్లడించారు. అప్పట్లో శివసేన అధినేత బాల్ ఠాక్రేను హత్య చేయడానికి ట్రై చేశానని చెప్పి ఆశ్చర్యపరిచారు. రెండు సార్లు రెక్కీ నిర్వహించినా తమ ప్లాను అమలు చేయలేకపోయామని చెప్పాడు. ముంబై దాడులకు ముందే ఠాక్రే ను చంపాలని కుట్ర పన్నినట్లు ఈ 26/11 ఉగ్రదాడుల కేసులో అప్రూవర్ హ్యాడ్లీ చెప్పాడు. వరుసగా రెండో రోజూ హ్యాడ్లీని వీడియో కాన్ఫరెన్సు ద్వారా కోర్టు విచారించింది. ఈ సందర్భంగా హ్యాడ్లీ ఈ సంచలన విషయాలను వెల్లడించాడు.
బాల్ ఠాక్రేను మతమార్చాల్సిందిగా లష్కరే ఇ తోయిబా తనను ఆదేశించిందని చెప్పాడు. అందుక కోసం తాను 2011 లో రెండు సార్లు శివసేన భవన్ ను సందర్శించానని పేర్కొన్నాడు. 2011 ముంబై ఉగ్రదాడులకు ముందు కూడా లష్కరే ఇ తోయిబా బాల్ ఠాక్రే హత్యకు ప్రయత్నించిందని వివరించారు. అయితే ఆ ప్రయత్నంలో బాల్ ఠాక్రే సురక్షితంగా బయటపడ్డారని హ్యాడ్లీ తెలిపాడు. అయితే.... కరడు గట్టిన హిందూభావజాలంతో ఉండే ఠాక్రేకు ఎంతమంది అభిమానులు ఉన్నారో అంతేస్థాయిలో శత్రువులూ ఉన్నారు. దీంతో ఆయన నిత్యం అప్రమత్తంగా ఉండేవారు. ఆయనపై ఈగ వాలడం కూడా కష్టమన్నంతగా భద్రత ఉండేది. ఆ కారణంగానే ఠాక్రేపై దాడి చేయడం ఇలాంటి ఉగ్ర ముష్కరుల వల్ల కూడా కాలేదు.