Begin typing your search above and press return to search.

చావు కేకల దాహాన్ని తీర్చుకుంటున్న మహిళ

By:  Tupaki Desk   |   17 Oct 2022 11:30 PM GMT
చావు కేకల దాహాన్ని తీర్చుకుంటున్న మహిళ
X
మహేష్ బాబు హీరో మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన మూవీ 'స్పైడర్'. ఈ సినిమాలో విలన్ ఎస్.జే సూర్యకు ఒక వింత సైకో ఫీలింగ్ ఉంటుంది. ఎవరైనా చస్తే చూడాలని.. ఆ ఏడుపులు వింటేనే అతడికి నిద్రపడుతుంది. అందుకే జనాలను చంపేసి అయినా తన చావు కేకల దాహాన్ని తీర్చుకుంటాడు.

అచ్చం అలాంటి మహిళనే బ్రిటన్ లో ఒకామె ఉంది. మరణాలు, అంత్యక్రియలు అంటే ఆమెకు ఎంతో ఇష్టమట.. అందుకే ఇప్పటికే 200కు పైగా అంత్యక్రియలకు పిలవకున్నా ఆమె హాజరువతోందట.. ఆ మహిళ ఈ విషయం చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. పైగా శ్మశానాల్లో కూర్చుంటేనే ఈమెకు స్వాంతన అని తెలిసి అంతా షాక్ అయిపోతున్నారు.

ఒక్కో వ్యక్తికి ఒక్కో తిక్క ఉంటుంది. అలాగే ఈ బ్రిటన్ మహిళకు చావులంటే పిచ్చి. విచిత్ర ఆసక్తి. ఎక్కడ అంత్యక్రియలు అయినా.. చావులు జరిగినా ఆమెకు ఇష్టమట.. అక్కడికి వెళ్లిపోతుంది. ఇప్పటికి 200కు పైగా అంత్యక్రియలకు హాజరైంది. సమాధులు ఆర్ట్ గ్యాలరీల్లాగా కనిపిస్తాయట..

లండన్ లోని ఇస్లింగ్టన్ ప్రాంతానికి చెందిన జీన్ ట్రెండ్ హిల్ (55) తనకు చిన్నతనం నుంచే ఇలా చావులు, అంత్యక్రియలపై ఆసక్తి ఏర్పడిందని చెబుతోంది. గతంలో బంధువులు, మిత్రుల అంత్యక్రియలకు హాజరైన ట్రెండ్ హిల్.. ఇప్పుడు ఆ పిచ్చితో ఎవరు చచ్చినా వారి శవాలు వస్తే దహన సంస్కారాలకు హాజరవుతోంది. శ్మశాన వాటికి సిబ్బందిని మచ్చిక చేసుకొని సంబంధం లేని వారి అంత్యక్రియలకు వెళుతోంది.

ఇలా చిన్నప్పటి నుంచి మరణం అంటే చాలా ఇష్టం. శశ్మానవాటికికు వెళ్లి సమాధులను చూస్తూ తిరుగుతుంటాను. అవి తనకు ఆర్ట్ గ్యాలెరీల్లాగా కనిపిస్తున్నాయని ఆమె చెప్పుకొచ్చింది. సమాధుల మధ్య దిగిన ఫొటోలను ఆమె పోస్ట్ చేసి ఆనందం వ్యక్తం చేస్తోంది.

ఇక 14 ఏళ్లకే ట్రెండ్ హిల్ తల్లి చనిపోయింది. 20 ఏళ్లకు తండ్రి మృతిచెందాడు.. నానమ్మ, అమ్మమ్మల వద్ద ఉంటూ ఆమె పెరిగింది. ఈ వ్యసనం ఎలా వచ్చిందో ఏమో కానీ బానిస అయిపోయింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.