Begin typing your search above and press return to search.
విచిత్రంగా ఉన్న ఉపాధ్యాయ సంఘాల వైఖరి
By: Tupaki Desk | 17 Aug 2022 12:30 PM GMTఉపాధ్యాయ సంఘాల వైఖరి చాలా విచిత్రంగా ఉంటోంది. ప్రభుత్వం ఏమి చెప్పినా, ఏ నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకించటమే పనిగా పెట్టుకున్నట్లు కనబడుతోంది. తాజాగా ఉపాధ్యాయుల అటెండెన్స్ కోసమని ప్రభుత్వం ఫేషియల్ రికగ్నిషన్ అనే యాప్ ను తీసుకొచ్చింది.
ఆ యాప్ ను ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మొబైల్ ఫోన్లలో ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఉదయం 9 గంటలకల్లా వాళ్ళ స్కూళ్ళకు వెళ్ళి తరగతి గదుల్లో పిల్లలతో యాప్ ద్వారా సెల్ఫీ తీసుకుని అప్ లోడ్ చేయాలి. మళ్ళీ సాయంత్రం కూడా అలాగే చేయాలి.
ప్రభుత్వం ఇలాంటి యాప్ తీసుకురావటంలో ఉద్దేశ్యం ఉపాధ్యాయులందరూ సమయానికి స్కూళ్ళకు హాజరై పిల్లలకు పాఠాలు చెప్పాలనే. అయితే ప్రభుత్వం ఇలాంటి యాప్ తీసుకురాగానే ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించటం మొదలుపెట్టాయి. తమ మొబైల్ ఫోన్లనో యాప్ ను ఇన్ స్టాల్ చేయటానికి నిరాకరిస్తున్నారు. యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవటానికి ఉపాధ్యాయులు చాలా అవమానకరంగా భావిస్తున్నట్లున్నారు.
పైగా తమ దగ్గర స్మార్ట్ట్ మొబైల్ లేదని, ఇంటర్నెట్ డేటా లేదని, మొబైల్ స్కూళ్ళల్లో వాడటం ఇష్టం లేదు కాబట్టి ఫోన్ ఇంట్లోనే ఉంచేస్తున్నట్లు చెబుతున్నారు. కాబట్టి ప్రభుత్వమే ఇంటర్నెట్ సౌకర్యమున్న డివైజ్ ఇస్తే యాప్ ఇన్ స్టాల్ చేసుకుని వాడటానికి తమకు ఎలాంటి ఇబ్బంది లేదని డీఈవోలకు లేఖలు రాస్తున్నారు. అంటే ప్రభుత్వం ఏమి చెప్పినా వ్యతిరేకించాలనే టార్గెట్ ఒకటే పెట్టుకున్నట్లు అర్ధమవుతోంది.
స్మార్ట్ మొబైల్ లేని ఉపాధ్యాయులు ఈ రోజుల్లో ఎవరైనా ఉంటారా ? వాళ్ళు పనిచేస్తున్న స్కూళ్ళల్లో ఇంటర్నెట్ సిగ్నల్ సరిగా లేదంటే నమ్మచ్చు. దానివల్ల యాప్ పనితీరు సరిగా ఉండటం లేదంటే ఎవరైనా నమ్ముతారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే జీతాల కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన ఉపాధ్యాయులు సమయానికి స్కూల్ కు రావటానికి మాత్రం ఇష్టపడటం లేదని అర్ధమవుతోంది.
అంటే హక్కులే కానీ బాధ్యతలు అవసరం లేదా ? యాప్ వినియోగంలో ఏవైనా ఇబ్బందులుంటే ఆ విషయాన్ని చెప్పుకోవటంలో తప్పులేదు. అంతేకానీ హోల్ మొత్తంమీద యాప్ నే వ్యతిరేకిస్తున్నారంటేనే వీళ్ళ ఆలోచనలు అర్ధమవుతోంది.