Begin typing your search above and press return to search.

ఏయూలో ప్రధాని సభకు చుక్కేదురు...

By:  Tupaki Desk   |   19 Feb 2019 12:55 PM GMT
ఏయూలో ప్రధాని సభకు చుక్కేదురు...
X
దేశంలో ఎన్నికల నగరా మ్రోగింది. దేశ ప్రధాని నుంచి ఎక్కడో మారుమూల పల్లేటూరిలోని చిన్న చితక కార్యకర్తలు వారి వారి పార్టీ జేండాలు పట్టుకుని ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసారు. ఈ నేపధ్యంలో విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27 వ తారిఖున ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం వెళాల్సి ఉంది. ఈ సందర్భంగా ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాగంణంలో తన సభను పెట్టుకుందామని అనుకున్నారు. దీనికి వైస్‌ ఛాన్స్‌ లర్ అనుమతించ లేదు. 2015 నిబంధనల ప్రకారం విశ్వవిద్యాలయాలా ప్రాగంణంలో ఎటువంటి అధ్యాత్మిక, రాజకీయ సభలు ఏర్పాటు చేసుకోవడానికి రూల్స్‌ లేవు అని అన్నారు.

ఇదే ప్రాగంణంలో 2017లో తెలుగుదేశం పార్టీ మహానాడు జరుపుకుంది. ఇదే విషయమై ప్రశ్నించగా అప్పట్లో వేసవి సెలవలు కావడం వల్ల విశ్వవిద్యాలయం మూసీవేసారని, అందుకే అనుమతినిచ్చామని ఆయన సమాధానమిచ్చారు. వైస్‌ ఛాన్స్‌లర్ అనుమతి నిరాకరించడంతో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నయం వెత్తుకుంటోంది. ఎన్నికల ముందు ప్రజలకు ఎన్నో వాగ్దనాలు చేసే ఈ నాయకులు ఎన్నికల అనంతరం తమ గోడును పట్టించుకోవటం లేదని, ప్రజలకు మేలు చేసే పనులు కంటే కూడా తమ అననయులు అనుకున్న వారికి మాత్రమే మేలు చేకూరుస్తున్నారని ఒక వర్గం ఆరోపిస్తోంది.

ఈ నెల మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ గుంటూరులో ఒక బహిరంగ సభలో మాట్లాడారు. ఆ సభలో ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని దుమ్మెత్తిపోసారు. ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌ ఏ ప్రాంతానికి వచ్చిన కూడా చంద్రబాబును దుమ్మెత్తి పోయడమే తప్పా రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనాలు ఒరగవని ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాపోతున్నారు. ఇన్నాళ్లు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య ఉన్న రాజకీయ పోరు విశాఖ సంఘటనతో మరింత రాజుకుంటుందని పరిశీలకులు అంటున్నారు. ఆంధ్రవిశ్వ విద్యాలయం ఆంధ్రప్రదేశ్ పరిధిలోనే ఉన్నా కేంద్రంతో వివాదం తేచ్చుకుంటే మాత్రం భవిష్యత్తులో కష్టాలు తప్పవని అంటున్నారు. మరోవైపు రాజకీయ పార్టీల నాయకుల మధ్య అధికారులు నలిగిపోవడం పరిపాటిగా మారింది. ఎన్నికలకు ముందో, తర్వాతో వారి వారి అవసరాల ద్రుష్ట్య రాజకీయ పార్టీలు కలుస్తాయి... విడిపోతాయి. మధ్యలో నలిగిపోయేది మాత్రం వివిధ శాఖలకు చెందిన అధికారులేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.