Begin typing your search above and press return to search.
వైన్ షాప్ కోసం రూ.510 కోట్లు పెట్టేశారు
By: Tupaki Desk | 9 March 2021 8:30 AM GMTఅదే వందలో.. వేయిలో కాదు.. లక్షలు దాటి కోట్లకు పోయింది.. ఆ వేలం పాట ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా తెలుగు రాష్ట్రాలైనా.. దేశంలోని ఏ రాష్ట్రాలైనా దాదాపు 50-80 లక్షలలోపే వైన్ షాప్ వేలం పాట ఉంటుంది..కొన్ని హైదరాబాద్ లాంటి ఏరియాల్లో 5 కోట్లలోపు ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం వైన్ షాప్ వేలం పాట 72 లక్షల నుంచి ప్రారంభమై ఏకంగా రూ.510 కోట్ల రూపాయలకు చేరుకుంది. అర్ధరాత్రి 2 గంటల వరకు సాగిన ఈ వేలం పాటను ఇద్దరు మహిళలు చేజిక్కించుకోవడం విశేషం.
మధ్యప్రదేశ్ లోని హనుమాన్ ఘర్ జిల్లాలోని ఓ ఊరిలో ఈ రికార్డ్ స్థాయి వేలం పాట జరిగింది. 72 లక్షల ప్రారంభధర వద్ద మొదలైన వేలం 510 కోట్లకు చేరింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు ఈ పాట పాడారు. కిరణ్ కన్వర్ అనే మహిళ ఈ వేలంలో 510 కోట్లకు ఈ వైన్ షాప్ ను దక్కించుకుంది. ఈ రేటు చూసి ఎక్సైజ్ అధికారులు, ప్రజలు, మందుబాబులు కూడా నోరెళ్లబెట్టడం విశేషం.
510 కోట్లలో ప్రస్తుతం 2శాతం ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ మొత్తమే ఎక్సైజ్ శాఖకు చాలా ఎక్కువ అట.. గత ఏడాది కేవలం 65 లక్షలకే ఈ వైన్ షాపు వేలంలో అమ్ముడు పోగా ఇప్పుడు 510 కోట్లకు చేరడం సంచలనంగామారింది.
మధ్యప్రదేశ్ లో మొత్తం 7665 వైన్ షాపులకు వేలం నిర్వహించగా.. దీనికి ఎవ్వరూ ఊహించని ధర పాడారు. ఇంత మొత్తం ఆ వైన్ షాపు ద్వారా రావని తెలిసినా వీరు ఎందుకు పాడారు? అసలు కథేంటి అనేది అంతుచిక్కడం లేదు.