Begin typing your search above and press return to search.
మనమే కాదు ఇతర దేశాలకూ పండగే
By: Tupaki Desk | 15 Aug 2015 4:56 AM GMTఆగస్టు 15 అన్న వెంటనే దేశం యావత్తు ఒక్కసారిగా భావోద్వేగంతో ఊగిపోతుంది. కొన్ని వందల ఏళ్ల పోరాటం.. లక్షలాది మంది త్యాగఫలం.. కోట్లాది మంది కష్టఫలం.. ఈ రోజు మనం అనుభవిస్తున్నస్వేచ్ఛ. పేరుకు ప్రజాస్వామ్యమనే కానీ.. అయినదానికి కాని దానికి నిబంధనల బంధనాల్లో మనసున అనుకున్నదేదీ చెప్పలేని దైన్యం చాలా దేశాల్లో కనిపిస్తుంది.
కానీ.. మనదేశంలో అలాంటి పరిస్థితి అస్సలు కనిపించదు. ప్రతిఒక్కరూ తమ హక్కుగా భావవ్యక్తీకరణ చేయటం మొదలు చాలానే హక్కుల్ని పొందాం. చాలామంది స్వేచ్ఛ సుఖంలో చాలానే మాటలు మాట్లాడుతుంటారు. కానీ.. వారు తమ మనసులోని అభిప్రాయాన్ని అంత కచ్ఛితంగా బయటపెడుతోంది.. తమకున్న స్వేచ్ఛా.. స్వాతంత్ర్యంతోనే అన్న విషయాన్ని మర్చిపోకూడదు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆగస్టు 15 అన్న వెంటనే మనకే కాదు.. పలు దేశాలకు పండగే. అది కూడా మనలానే స్వాతంత్ర్యం పండుగ. మనతో పాటు.. కొన్ని దేశాలు ఆగస్టు 15నే బానిస బంధనాల నుంచి విముక్తి అయ్యాయి.
అలాంటి విముక్తి అయిన దేశాల్లో భారత్.. దక్షిణ.. ఉత్తర కొరియా.. కాంగో.. దేశాల్లోనూ ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా సాగుతుంటాయి. మనకు సుమారు 200 ఏళ్ల పోరాటం అనంతరం 1947 ఆగస్టు 14 అర్థరాత్రి దాటిన తర్వాత స్వేచ్ఛను ప్రసాదిస్తూ.. మనల్ని పాలించిన తెల్ల దొరలు.. రాజ్యాధికారాన్ని మనకు ఇచ్చేశారు. ఆగస్టు 14న పాక్ కు స్వేచ్చా వాయువుల్ని ప్రసాదించిన నాటి బ్రిటీష్ ప్రభుత్వం.. భారత్ కు ఒక రోజు ఆలస్యంగా స్వేచ్ఛను ఇచ్చింది.
ఇక.. మన మాదిరే కొరియా జపాన్ పాలనలో మగ్గేది. ఆ దేశానికి 1945 ఆగస్టు 15న వలస పాలన నుంచి విముక్తి చేస్తూ స్వాతంత్ర్యాన్ని ఇచ్చారు. అయితే.. జపాన్ నుంచి విముక్తి పొందిన కొరియా.. ఆ వెంటనే అమెరికా.. సోవియట్ రష్యాల అధీనంలోకి వెళ్లిపోయాయి.
తర్వాత మూడేళ్లకు ఉత్తర కొరియా.. దక్షిణ కొరియాలుగా విడిపోయాయి. దీంతో వారి అధికారిక స్వాతంత్యం 1948 ఆగస్టు 15న సంపూర్ణ స్వేచ్ఛను పొందారు అయితే.. రెండుగా విడిపోయిన కొరియాలో దక్షిణ కొరియా ఆగస్టు 15న స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటే.. ఉత్తర కొరియా మాత్రం సెప్టెంబరు 9న ఇండిపెండెన్స్ డేను జరుపుకుంటారు. దక్షిణ కొరియాలో ప్రజాస్వామ్యం నడుస్తుంటే.. ఉత్తర కొరియాలో మాత్రం నియంత పాలనలో మగ్గుతోంది. ప్రస్తుతం ఆ దేశం కిమ్ జంగ్ యున్ అనే నరరూప రాక్షసుడిలాంటి నియంత నేతృత్వంలో నడుస్తోంది.
ఇక.. కాంగో కూడా మనలానే ఆగస్టు 15న స్వాతంత్ర్య వేడుకల్ని జరుపుకుంటుంటారు. ఫ్రాన్స్ అధీనంతో ఉన్న కాంగో.. 1960 ఆగస్టు 15న స్వేచ్ఛను పొందింది.
అలా ఆగస్టు 15 మనకు మాత్రమే కాదు.. పలు దేశాలకు పండగగా మారింది. ఇక.. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆగస్టు 15న పలువురు ప్రముఖులు జన్మించారు. స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో ఆగస్టు 15న ఎవరైనా జన్మిస్తే స్వరాజ్యం.. స్వరాజ్ లాంటి పేర్లు పెట్టుకునే వారు.
ఆగస్టు 15న జన్మించి.. ప్రముఖులుగా కీర్తిప్రతిష్టలు పొందిన వారు పలువురు ఉన్నారు. వీరిలో కొందరు స్వాతంత్ర్యo ముందు పుట్టినోళ్ల నుంచి తర్వాత పుట్టిన వాళ్లు కూడా ఉన్నారు.
= ప్రముఖ తత్వవేత్త.. యోగి.. గురు అరబిందో ఘోష్ జన్మించింది 1872 ఆగస్టు 15నే.
= దక్షిణాధి సూపర్ హీరోగా పేరొందిన యాక్షన్ కింగ్ అర్జున్ కర్ణాటకలోని మైసూర్ లో ఆగస్టు 15న జన్మించారు.
= ప్రముఖ నటి సుహాసిని జన్మించింది 1961 ఆగస్టు 15నే. కెమేరా అసిస్టెంట్ గా కెరీర్ స్టార్ చేసి హీరోయిన్ గా.. క్యారెక్టర్ ఆరిస్ట్ గా రాణించారు.
= బ్రిటన్ లో పుట్టిన పాక్ గాయకుడు అద్నాన్ సమీ పుట్టిన రోజు ఆగస్టు 15నే. 2001లో భారత్ కు వచ్చిన ఆయన భారత్ లోనే ఉండొచ్చని అనుమతి పొందారు.
= దివంగత నటులు శ్రీహరి జన్మదినోత్సవం ఆగస్టు 15నే.
= ప్రముఖ రియల్ ఎస్టేట్ రంగ ప్రముఖుడు కేపీ సింగ్(కుషాల్ పాల్ సింగ్) పుట్టింది ఆగస్టు 15నే.
= బాలీవుడ్ నటి సింఫుల్ కపాడియా జన్మించింది ఆగస్టు 15నే. ఆమె 2009లో మరణించారు.
= తెలుగుతెరపై ఒక వెలుగు వెలిగిన నటి రాజ సులోచన జన్మించింది ఆగస్టు 15నే. ఆమె 2013లో మరణించారు.