Begin typing your search above and press return to search.

ఆగ‌స్టు 21 : అటు ప‌వన్ ఇటు లోకేశ్

By:  Tupaki Desk   |   19 Aug 2022 5:38 AM GMT
ఆగ‌స్టు 21  : అటు ప‌వన్ ఇటు లోకేశ్
X
ఒకే రోజు ఇద్ద‌రు నేత‌ల పర్య‌ట‌న‌లు ఆస‌క్తి రేపుతున్నాయి. రాజకీయంగానూ, సామాజికంగానూ మంచి ప‌ట్టు ఉన్న నాయ‌కులు అంతా ఆ ఇద్ద‌రి నేత‌ల ప‌ర్య‌ట‌న‌ల‌పై విశ్లేష‌ణలు చేస్తూ ఉన్నారు. వారే లోకేశ్, ప‌వ‌న్. టీడీపీ యువ నేత లోకేశ్ త‌న ప‌ర్య‌ట‌నలో భాగంగా ఈ నెల 21న శ్రీ‌కాకుళం జిల్లాకు విచ్చేయ‌నున్నారు.

ఆయ‌న ఆ రోజు పాత‌ప‌ట్నం మాజీ ఎమ్మెల్యే క‌ల‌మ‌ట సాగ‌ర్ వివాహ వేడుక‌ల్లో పాల్గొన‌డంతో పాటు (కొత్తూరు మండ‌లం, మాత‌ల గ్రామం) వివిధ ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తార‌ని టీడీపీ లీడ‌ర్లు అంటున్నారు.

ఇదే రోజు తిరుప‌తిలో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌వాణి పేరిట ఓ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్నారు. దీంతో ఆగ‌స్టు 21 అనే తేదీకి ప్రాధాన్యం వ‌చ్చింది. లోకేశ్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన ప్రధాన స‌మ‌స్య అయిన వంశ‌ధార నిర్వాసితుల‌పై ఏమ‌యినా మాట్లాడ‌తారా అన్న ఆస‌క్తి నెల‌కొని ఉంది.

ఇప్ప‌టికే సీఎం జ‌గ‌న్ మొన్న‌టి వేళ కొంత మొత్తంను నిర్వాసితుల‌కు అందించారు. ఈ పంపిణీలో కూడా ఇంకా చాలా మందికి అన్యాయం జ‌రిగే ఉంద‌న్న వార్త‌లూ వ‌స్తున్నాయి. ముఖ్యంగా లోకేశ్ వ‌చ్చే వేళ స్థానికంగా ఉన్న అనేక స‌మ‌స్య‌ల‌పై సంబంధిత నాయ‌కులు కాస్తో కూస్తో గొంతు వినిపిస్తే బాగుంటుందనుకుంటున్నారు.

పాత‌ప‌ట్నంతో పాటు ఇక్క‌డ ఉన్న పాల‌కొండ, ప‌లాస ఇంకా ఇత‌ర ప్రాంతాలలో టీడీపీ ప‌ట్టు అంతంత మాత్రంగానే ఉంద‌న్న విమ‌ర్శ‌లూ ఉన్నాయి. వీటిపై దృష్టి సారించి ప్ర‌ధాన స‌మ‌స్య‌లు అయిన ఉద్దానంతో పాటు మ‌రికొన్ని స్థానిక స‌మ‌స్య‌ల‌పై లోకేశ్ త‌న పోరాటం సాగిస్తాన‌ని ఓ మాట చెబితే శ్రేణులను అందుకు అనుగుణంగా స‌మాయ‌త్తం చేయ‌గ‌లిగితే బాగుంటుందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.

మ‌రోవైపు ప‌వ‌న్ పోరాటం కూడా తిరుప‌తి కేంద్రంగా సాగ‌నుంది. ఆయ‌న కూడా ప్ర‌భుత్వం పై విరుచుకుప‌డ‌నున్నారు. పదునైన విమర్శలతో ప్రభుత్వాన్ని కలవర పెడతున్నారు పవన్ కళ్యాణ్. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ అటు ప‌వ‌న్ కానీ ఇటు లోకేశ్ కానీ మ‌రింత స‌మర్థంగా ప‌నిచేస్తే ఫ‌లితాలు బాగుంటాయి.