Begin typing your search above and press return to search.
బాబు ఫ్లైట్ ఎక్కగానే టీడీపీ ఖేల్ ఖతం
By: Tupaki Desk | 30 July 2019 6:23 AM GMTతెలుగుదేశం పార్టీకి బీజేపీ ముహూర్తం పెట్టేసినట్టే కనిపిస్తోంది.. రాబోయే శ్రావణం శుభప్రదమని.. టీడీపీ నుంచి వలసలను అప్పుడే ప్రోత్సహించి టీడీపీని కోలాప్స్ చేయాలని స్కెచ్ గీసినట్టు ప్రచారం జరుగుతోంది.
చంద్రబాబు తాజాగా ఆగస్టులో విదేశీ పర్యటన పెట్టుకున్నారు. మొన్నటిసారి విదేశాలకు వెళ్లగా నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరడంతో తన పర్యటనను అర్థాంతరంగా ముగించుకొని ఏపికి తిరిగివచ్చారు. ఇప్పుడు మరోసారి ఆగస్టులోనే విదేశీ పర్యటనకు వెళుతున్నారు.
అయితే తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అనంతపురం జిల్లాలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ శ్రావణంలో బీజేపీలోకి భారీ చేరికలు ఉంటాయని తెలిపారు.. ఎమ్మెల్యేలు - మాజీ ఎమ్మెల్యేలు - సీనియర్ నేతలను ఆగస్టులోనే చేర్చుకోబోతున్నట్టు ప్రకటించడం సంచలనంగా మారింది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. చంద్రబాబు విదేశీ పర్యటనకు ఫ్లైట్ ఎక్కగానే బీజేపీ ఆపరేషన్ టీడీపీ చేపట్టేందుకు రెడీ అయినట్టు సమాచారం.. చంద్రబాబు విదేశీ టూర్ లో ఉండడంతో టీడీపీ ఎమ్మెల్యేలను మేనేజ్ చేయలేడని.. అప్పుడు టీడీపీనీ అదును చూసి దెబ్బకొట్టి లాగేయవచ్చని బీజేపీ ప్లాన్ చేసినట్టు తెలిసింది.
టీడీపీలో వరుసగా ఆగస్టులోనే సంక్షోభాలు వస్తున్నాయి. తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్ 1984 - 1995లో ఆగస్టులోనే సీఎం పీఠం నుంచి దిగిపోవాల్సి వచ్చింది. నాడు నాదెండ్ల - నేడు చంద్రబాబు సీనియర్ ఎన్టీఆర్ ను పదవీ చిత్యుడిని చేశారు. ఇప్పుడు చంద్రబాబును కూడా ఇదే ఆగస్టు సంక్షోభం వెంటాడుతోందట.. బీజేపీ దెబ్బకు చంద్రబాబు విదేశీ పర్యటనను కొనసాగిస్తారా లేదా అన్నది వేచిచూడాలి.